Breaking News

Test Match: విఫలమైన సూర్యకుమార్‌ యాదవ్‌.. 8 పరుగులకే అవుట్‌..

Published on Thu, 07/13/2023 - 16:27

Duleep Trophy 2023- West Zone vs South Zone, Final: ప్రతిష్టాత్మక దులిప్‌ ట్రోఫీ-2023 ఫైనల్లో వెస్ట్‌ జోన్‌ బ్యాటర్‌ పృథ్వీ షా అర్ధ శతకంతో మెరిశాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సౌత్‌ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 101 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 65 పరుగులతో రాణించాడు ఈ ఓపెనర్‌. అయితే, మిగతా బ్యాటర్ల నుంచి పృథ్వీ షాకు సహకారం లభించలేదు.

8 పరుగులకే అవుట్‌
మరో ఓపెనర్‌, కెప్టెన్‌ ప్రియాంక్‌ పాంచల్‌ 11 పరుగులకే పెవిలియన్‌ చేరగా.. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ హర్విక్‌ దేశాయ్‌ 21 పరుగులు చేయగలిగాడు. ఇక నాలుగో స్థానంలో దిగిన టీమిండియా నయావాల్‌ ఛతేశ్వర్‌ పుజారా పోరాడుతుండగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన మరో భారత స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ పూర్తిగా నిరాశపరిచాడు.

6 బంతులు ఎదుర్కొన్న ఈ మిస్టర్‌ 360 డిగ్రీ ప్లేయర్‌ కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. సౌత్‌ జోన్‌ బౌలర్‌ విధ్వత్‌ కవెరప్ప బౌలింగ్‌లో కెప్టెన్‌ హనుమ విహారికి క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. మరోవైపు సర్ఫరాజ్‌ ఖాన్‌ను కవెరప్ప వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు. 

తిలక్‌, విహారి ఇన్నింగ్స్‌తో
ఇలా కీలక బ్యాటర్లు విఫలం కావడంతో వెస్ట్‌ జోన్‌ 119 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దులిప్‌ ట్రోఫీ-2023 ఫైనల్‌ రెండో రోజు ఆటను వెలుతురులేమి కారణంగా నిలిపివేసే సమయానికి పుజారా 7, అతిత్‌ సేత్‌ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే.. తెలుగు క్రికెటర్లు తిలక్‌ వర్మ(40), హనుమ విహారి(63) ఆదుకోవడంతో సౌత్‌ జోన్‌ 213 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ ముగించింది. వెస్ట్‌ జోన్‌ ప్రస్తుతం 94 పరుగులు వెనుకబడి ఉంది.

ఇలాగైతే..
కాగా టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అయితే, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌-2023లో విఫలమైన కారణంగా పుజారా టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు.

ఇక వన్డే, టీ20 జట్లలో స్థానం సంపాదించిన సూర్యకుమార్‌ యాదవ్‌కు కూడా టెస్టు జట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో పుజారా, సూర్య దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించడం గమనార్హం. ఇక దులిప్‌ ట్రోఫీ ముగిసిన తర్వాత సూర్య కరేబియన్‌ దీవికి పయనం కానున్నట్లు తెలుస్తోంది.

చదవండి: Ind Vs WI: మనం తప్పు చేశామా అని పశ్చాత్తాపపడేలా చేశాడు! తొలిరోజే
అతడికి టెస్టుల్లో అవకాశం ఇవ్వండి.. మార్క్‌వుడ్‌ మాదిరే: మాజీ క్రికెటర్‌ 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)