Breaking News

Duleep Trophy 2024: ఆరేసిన అర్షదీప్‌.. ఇండియా-డి ఘన విజయం

Published on Sun, 09/22/2024 - 15:01

దులీప్‌ ట్రోఫీ 2024 ఎడిషన్‌లో ఇండియా-డి ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇండియా-బితో ఇవాళ (సెప్టెంబర్‌ 22) ముగిసిన మ్యాచ్‌లో 257 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

ఆరేసిన అర్షదీప్‌
373 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో​కి దిగిన ఇండియా-బి.. అర్షదీప్‌ సింగ్‌ (6/40), ఆదిథ్య థాకరే (4/59) ధాటికి 115 పరుగులకే కుప్పకూలింది. ఇండియా-బి ఇన్నింగ్స్‌లో నితీశ్‌ రెడ్డి (40 నాటౌట్‌), అభిమన్యు ఈశ్వరన్‌ (19), సూర్యకుమార్‌ యాదవ్‌ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

రికీ భుయ్‌ అజేయ శతకం
రికీ భుయ్‌ అజేయ సెంచరీతో (119) కదం తొక్కడంతో ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 305 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (50), సంజూ శాంసన్‌ (45) రాణించారు. ఇండియా-బి బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ 4, నవ్‌దీప్‌ సైనీ 3, మోహిత్‌ అవస్థి, వాషింగ్టన్‌ సుందర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అభిమన్యు ఈశ్వరన్‌ సెంచరీ.. ఆదుకున్న సుందర్‌
అభిమన్యు ఈశ్వరన్‌ సెంచరీతో (116), వాషింగ్టన్‌ సుందర్‌ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (87) రాణించడంతో ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులు చేయగలిగింది. ఇండియా-డి బౌలర్లలో సౌరభ్‌ కుమార్‌ 5, అర్షదీప్‌ 3, ఆదిథ్య ఠాకరే 2 వికెట్లు తీశారు.

సంజూ మెరుపు సెంచరీ.. పడిక్కల్‌, భరత్‌, భుయ్‌ అర్ద సెంచరీలు
తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 349 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌ మెరుపు సెంచరీతో (106) చెలరేగగా.. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (50), శ్రీకర్‌ భరత్‌ (52), రికీ భుయ్‌ (56) అర్ద సెంచరీలతో రాణించారు. ఇండియా-బి బౌలర్లలో నవదీప్‌ సైనీ 5, రాహుల్‌ చాహర్‌ 3, ముకేశ్‌ కుమార్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

చదవండి: బంగ్లాతో రెండు టెస్టు.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)