Breaking News

నిశాంత్, హర్షిత్‌ సెంచరీలు.. ప్రత్యర్థి జట్టుకు తప్పని తిప్పలు

Published on Fri, 06/30/2023 - 08:21

బెంగళూరు: దులీప్‌ ట్రోఫీ క్రికెట్‌ టోర్నీలో భాగంగా నార్త్‌ ఈస్ట్‌ జోన్‌ జట్టుతో జరుగుతున్న క్వార్టర్‌ ఫైనల్లో నార్త్‌ జోన్‌ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 306/6 రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన నార్త్‌ జోన్‌ జట్టు 8 వికెట్లకు 540 పరుగులవద్ద డిక్లేర్‌ చేసింది.

నిశాంత్‌ సింధు (245 బంతుల్లో 150; 18 ఫోర్లు, 3 సిక్స్‌లు), హర్షిత్‌ రాణా (86 బంతుల్లో 122 నాటౌట్‌; 12 ఫోర్లు, 9 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. నిశాంత్‌తో కలిసి హర్షిత్‌ ఎనిమిదో వికెట్‌కు 104 పరుగులు... సిద్ధార్థ్‌ కౌల్‌ (9 నాటౌట్‌)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 64 పరుగులు జోడించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన నార్త్‌ ఈస్ట్‌ జోన్‌ జట్టు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది.  

సెంట్రల్‌ జోన్‌కు ఆధిక్యం 
ఈస్ట్‌ జోన్‌ జట్టుతో జరగుతున్న మరో క్వార్టర్‌ ఫైనల్లో సెంట్రల్‌ జోన్‌ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఓవరాల్‌గా 124 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. సెంట్రల్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు జవాబుగా ఈస్ట్‌ జోన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 42.2 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌటైంది.

సెంట్రల్‌ జోన్‌ బౌలర్లలో అవేశ్‌ ఖాన్, సౌరభ్‌ కుమార్‌ మూడు వికెట్ల చొప్పున తీశారు. 60 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం పొందిన సెంట్రల్‌ జోన్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 64 పరుగులు సాధించింది.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)