Breaking News

నిరాశపరచిన తిలక్‌ వర్మ.. చేతులెత్తేసిన పుజారా, సూర్యకుమార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌

Published on Fri, 07/14/2023 - 15:56

వెస్ట్‌ జోన్‌తో జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ 2023 ఫైనల్లో సౌత్‌ జోన్‌ జట్టు పట్టు బిగిస్తుంది. మూడో రోజు ఆట సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 67 పరుగుల లీడ్‌తో కలుపుకుని మొత్తంగా 248 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో సౌత్‌ జోన్‌ 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి, ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. వాషింగ్టన్‌ సుందర్‌ (10), విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. సౌత్‌ జోన్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో  తిలక్‌ వర్మ (3) నిరాశపరచగా.. మయాంక్‌ అగర్వాల్‌ (35), హనుమ విహారి (42), రికీ భుయ్‌ (27) పర్వాలేదనిపించారు.

కావేరప్ప దెబ్బకు కుప్పకూలిన వెస్ట్‌ జోన్‌..
ఈ మ్యాచ్‌లో కర్ణాటక పేసర్‌ విధ్వత్‌ కావేరప్ప (7/53) దెబ్బకు వెస్ట్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. వెస్ట్‌ జోన్‌ బ్యాటర్లలో పృథ్వీ షా (65) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. టీమిండియా స్టార్‌ ప్లేయర్లు ఛతేశ్వర్‌ పుజారా (9), సూర్యకుమార్‌ యాదవ్‌ (8) దారుణంగా విఫలం కాగా.. అప్‌కమింగ్‌ హీరో అంటూ ఊదరగొట్టబడుతున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ డకౌటై నిరాశపరిచాడు. కావేరప్పతో పాటు విజయకుమార్‌ వైశాఖ్‌ (2/33), కౌశిక్‌ (1/26) వికెట్లు పడగొట్టారు. 

అంతకుముందు సౌత్‌జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి (63) అర్ధసెంచరీతో రాణించగా.. తిలక్‌ వర్మ (40), మయాంక్‌ అగర్వాల్‌ (28), వాషింగ్టన్‌ సుందర్‌ (22 నాటౌట్‌) పర్వాలేదనిపించారు. షమ్స్‌ ములానీ (3/29), నగవస్వల్లా (2/62), చింతన్‌ గజా (2/27), డి జడేజా (2/33), సేథ్‌ (1/47) సౌత్‌ జోన్‌ను దెబ్బకొట్టారు.  

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి