Breaking News

మార్కు చూపించిన తిలక్‌ వర్మ.. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో విహారి! ఫైనల్లో జట్టును..

Published on Wed, 07/12/2023 - 18:42

Duleep Trophy 2023- West Zone vs South Zone, Final: ప్రతిష్టాత్మక దులిప్‌ ట్రోఫీ-2023లో భాగంగా వెస్ట్‌ జోన్‌- సౌత్‌ జోన్‌ మధ్య బుధవారం ఫైనల్‌ ఆరంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్ట్‌ జోన్‌ కెప్టెన్‌ ప్రియాంక్‌ పాంచల్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. 

దీంతో బ్యాటింగ్‌కు దిగిన సౌత్‌ జోన్‌ ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్‌ రవికుమార్‌ సమర్త్‌ 7 పరుగులకే పెవిలియన్‌ చేరగా.. మరో ఓపెనింగ్‌ బ్యాటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ 28 పరుగులు చేయగలిగాడు. ఈ క్రమంలో తెలుగు తేజాలు తిలక్‌ వర్మ, హనుమ విహారి జట్టును ఆదుకునే బాధ్యత తీసుకున్నారు.

మార్కు చూపించిన తిలక్‌ వర్మ.. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో విహారి
వన్‌డౌన్‌లో వచ్చిన హైదరాబాదీ బ్యాటర్‌ తిలక్‌ 87 బంతుల్లో 40 పరుగులు సాధించగా.. విహారి 63 పరుగుల(130 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో)తో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కు 79 పరుగులు జతచేశారు. ఇక నగ్వాస్‌వల్లా బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ హర్విక్‌ దేశాయ్‌కు క్యాచ్‌ ఇచ్చి తిలక్‌ పెవిలియన్‌ చేరగా.. షామ్స్‌ ములాని విహారి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

వెలుతురు లేమి కారణంగా
వీరిద్దరు అవుటైన తర్వాత సౌత్‌ జోన్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. రికీ భుయ్‌ 9, సచిన్‌ బేబి 7, సాయి కిషోర్‌ 5 పరుగులు మాత్రమే చేశారు. తొలిరోజు ఆట ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోరు చేసింది సౌత్‌ జోన్‌ జట్టు.

వాషింగ్టన్‌ సుందర్‌(9), విజయ్‌కుమార్‌ వైశాక్‌(5) క్రీజులో ఉన్నారు. వెస్ట్‌ జోన్‌ బౌలర్లలో అర్జాన్‌ నగ్వాస్‌వల్లా, చింతన్‌ గజా, షామ్స్‌ ములాని రెండేసి వికెట్లు తీయగా.. అతిత్‌ సేత్‌కు ఒక వికెట్‌ దక్కింది. ఇక వెలుతురు లేమి కారణంగా మొదటి రోజు 25 ఓవర్ల ఆట సాధ్యపడలేదు.

విహారి 46వ ఫిఫ్టీ
వెస్ట్‌ జోన్‌తో దులిప్‌ ట్రోఫీ సందర్భంగా సౌత్‌ జోన్‌ కెప్టెన్‌ హనుమ విహారి అర్ధ శతకంతో మెరిశాడు. ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో అతడికి ఇది 46వ ఫిఫ్టీ. ఇక ఈ మ్యాచ్‌లో 63 పరుగులు సాధించడం ద్వారా విహారి ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 8706 రన్స్‌ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 23 సెంచరీలు, 46 అర్ధ శతకాలు ఉన్నాయి. 

చదవండి: Ind Vs WI: దవడ పగిలినా బౌలింగ్‌ చేసి.. దిగ్గజ బ్యాటర్‌ వికెట్‌ తీసి!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)