Breaking News

రాణించిన పుజారా.. సత్తా చాటిన సూర్యకుమార్‌, నిరాశపరిచిన పృథ్వీ షా

Published on Fri, 07/07/2023 - 08:49

సెంట్రల్‌ జోన్‌తో జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ-2023 తొలి సెమీఫైనల్లో వెస్ట్‌ జోన్‌ పట్టు బిగించింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి, 241 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చతేశ్వర్‌ పుజారా (50), సర్ఫరాజ్‌ ఖాన్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్‌లో టీమిండియా చిచ్చరపిడుగు సూర్యకుమార్‌ యాదవ్‌ (58 బంతుల్లో 52; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగగా.. పృథ్వీ షా (25) నిరాశపరిచాడు. సెంట్రల్‌ జోన్‌ బౌలర్లలో సౌరభ్‌ కుమార్‌ 2, యశ్‌ ఠాకూర్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.

అంతకుముందు వెస్ట్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులకు ఆలౌటైంది. శివమ్‌ మావి (6/43) వెస్ట్‌ జోన్‌ పతనాన్ని శాశించాడు. ఆవేశ్‌ ఖాన్‌, యశ్‌ ఠాకూర్‌, సౌరభ్‌ కుమార్‌, సరాన్ష్‌ జైన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. వెస్ట్‌ జోన్‌ బ్యాటర్లలో అతీత్‌ సేథ్‌ (74) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. పృథ్వీ షా (26), పుజారా (28) ఓ మోస్తరు స్కోర్లకే పరిమితమయ్యారు. సూర్యకుమార్‌ యాదవ్‌ (7), సర్ఫరాజ్‌ ఖాన్‌ (0) నిరాశపరిచారు. 

ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్‌ జోన్‌.. నగ్వస్వల్లా (5/74), అతీత్‌ సేథ్‌ (3/27), చింతన్‌ గజా (2/25) ధాటికి 128 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్‌ హీరో రింకూ సింగ్‌ (48) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)