Breaking News

‘రోహిత్‌ ఎవరినో తిడుతున్నాడు.. ఆరోజు ద్రవిడ్‌కు నిద్ర పట్టలేదు’

Published on Tue, 07/30/2024 - 12:55

2015, 2016, 2017, 2019, 2022.. 2023.. ఐసీసీ వరల్డ్‌కప్‌ టోర్నీల్లో భారత్‌కు ఎదురైన చేదు అనుభవాలను మరిపిస్తూ.. నెల రోజుల క్రితం ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది. ఫలితంగా దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి.

ఈ టైటిల్‌ సాధించిన తర్వాత హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ తన ప్రస్థానం ముగించగా.. దిగ్గజ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. విండీస్‌లోని బార్బడోస్‌లో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్‌ విజేతగా నిలిచిన తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో కోహ్లి- రోహిత్‌ అభిమానులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. 

అయితే, యావత్‌ భారతావని మాత్రం వరల్డ్‌కప్‌ హీరోలు ఎప్పుడెప్పుడు తిరిగి వస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూసింది. అయితే, బార్బడోస్‌లో హారికేన్‌ బీభత్సం వల్ల టీమిండియా రాక రెండు రోజులు ఆలస్యమైంది. ఉధృతమైన వర్షాల కారణంగా విమాన సర్వీసులు రద్దు కాగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి తక్షణ చర్యలు చేపట్టింది. 

వాతావరణం కాస్త తేలికపడగానే AIC24WC చార్టెడ్‌ ఫ్లైట్‌ను బార్బడోస్‌కు పంపింది. ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో పాటు కవరేజ్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులను కూడా ఇదే విమానంలో భారత్‌కు తీసుకువచ్చారు.

ఈ క్రమంలో స్టార్‌ స్పోర్ట్స్‌ ప్రొడ్యూసర్‌ ఒకరు నాటి విమాన ప్రయాణానికి సంబంధించిన జ్ఞాపకాలను తాజాగా గుర్తుచేసుకున్నారు. ‘‘ఆరోజు బార్బడోస్‌ నుంచి ఢిల్లీకి విమాన ప్రయాణం. పదహారు గంటల జర్నీ. అయితే, ఆరోజు ఎవరూ కూడా ఆరు గంటలకు మించి నిద్రపోలేదు. అంతా సందడి సందడిగా సాగింది.

ఆటగాళ్లలో చాలా మంది ప్రెస్‌ వాళ్లను కలవడానికి వచ్చారు. వారితో ముచ్చట్లు పెట్టారు. అందరి కంటే రోహిత్‌ శర్మ ఎక్కువసార్లు బయటకు వచ్చాడు. బిజినెస్‌ క్లాస్‌ అంతా విజయ సంబరంతో అల్లరి అల్లరిగా ఉండటంతో రాహుల్‌ ద్రవిడ్‌ ఒకానొక సమయంలో ఎకానమీ క్లాస్‌కు వచ్చేశాడు. బిజినెస్‌ క్లాస్‌లో నిద్రపట్టడం లేదని..ఎకానమీ క్లాస్‌లో నిద్రపోయాడు.

నేను నిద్రపోతున్న సమయంలో రోహిత్‌ శర్మ ఎవరినో తిడుతున్నట్లుగా శబ్దాలు వినిపించాయి. లేచి చూస్తే నిజంగానే రోహిత్‌ అక్కడ ఎవరినో ఏదో అంటున్నాడు. అయితే, తనదైన స్టైల్లో సరదాగానే వారికి చివాట్లు పెడుతూ ఆటపట్టిస్తున్నాడు. ఆ తర్వాత రిషభ్‌ పంత్‌, హార్దిక్‌పాండ్యా అందరూ బయటకు వచ్చారు. మీడియా వాళ్లతో ముచ్చటించారు. ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు’’ అని పేర్కొన్నారు.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)