Breaking News

నరాలు తెగే ఉత్కంఠ: ద్రవిడ్‌ హృదయం ముక్కలు.. గోయెంకా రియాక్షన్‌ వైరల్‌

Published on Sun, 04/20/2025 - 12:15

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో రాజస్తాన్‌ రాయల్స్‌ మరోసారి దురదృష్టకర రీతిలో ఓటమి పాలైంది. గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో సరిసమానంగా స్కోరు చేసినా సంజూ సేన సూపర్‌ ఓవర్‌లో బోల్తా పడిన విషయం తెలిసిందే. తాజాగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లోనూ రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది.

ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆవేశ్‌ ఖాన్‌ (Avesh Khan) తన అద్భుత బౌలింగ్‌ నైపుణ్యాలతో లక్నోకు విజయం అందించాడు. ఫలితంగా రాజస్తాన్‌ మరోసారి ఓటమి భారంతో తలదించుకోవాల్సి వచ్చింది. జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో రాజస్తాన్‌- లక్నో (RR vs LSG) జట్ల మధ్య శనివారం రాత్రి మ్యాచ్‌ జరిగింది.

180 పరుగులు
సొంత మైదానంలో టాస్‌ ఓడిన రాజస్తాన్‌ తొలుత బౌలింగ్‌కు దిగింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 180 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ (45 బంతుల్లో 66)తో పాటు ఆయుశ్‌ బదోని (34 బంతుల్లో 50), అబ్దుల్‌ సమద్‌ (10 బంతుల్లో 30 నాటౌట్‌) రాణించారు.

రాజస్తాన్‌ బౌలర్లలో వనిందు హసరంగ రెండు, జోఫ్రా ఆర్చర్‌, సందీప్‌ శర్మ, తుషార్‌ దేశ్‌పాండే ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. ఇక లక్నో విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్తాన్‌ తమ ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించింది.

దంచికొట్టిన ఓపెనర్లు
ఓపెనర్‌ యశ​స్వి జైస్వాల్‌ (52 బంతుల్లో 74) బ్యాట్‌ ఝులిపించగా.. అతడికి జోడీగా వచ్చిన అరంగేట్ర ఆటగాడు, 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ కూడా దుమ్ములేపాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి ఐపీఎల్‌లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొని 34 పరుగులు చేసి నిష్క్రమించాడు.

అయితే, ఓపెనర్లు శుభారంభం అందించినా రాజస్తాన్‌ అదే జోరునుకొనసాగించలేకపోయింది. నితీశ్‌ రాణా (8) విఫలం కాగా.. కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (26 బంతుల్లో 39) ఫర్వాలేదనిపించాడు. ఆఖరి ఓవర్లో రాజస్తాన్‌ విజయానికి కేవలం తొమ్మిది పరుగులే అవసరమయ్యాయి.

ఆఖరి ఓవర్లో హైడ్రామా
ఈ క్రమంలో బంతితో రంగంలోకి దిగిన లక్నో పేసర్‌ ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో తొలి బంతికి ధ్రువ్‌ జురెల్‌ సింగిల్‌ తీశాడు. అనంతరం షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ జురెల్‌తో కలిసి రెండు పరుగులు పూర్తి చేశాడు. ఫలితంగా రాజస్తాన్‌ విజయ సమీకరణం నాలుగు బంతుల్లో 6 గా మారింది.

సరిగ్గా అప్పుడే ఆవేశ్‌ ఖాన్‌ తన నైపుణ్యాలకు మెరుగుపెట్టి మూడో బంతికి హెట్‌మెయిర్‌ (12)ను పెవిలియన్‌కు పంపాడు. ఆ మరుసటి బంతికి పరుగులేమీ ఇవ్వకుండా డాట్‌ చేశాడు. అనంతరం శుభమ్‌ దూబే రెండు పరుగులు తీయగా.. ఆఖరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సిన పరిస్థితి. కానీ దూబే ఒక్క పరుగు మాత్రమే తీయగలిగాడు.

ద్రవిడ్‌ హృదయం ముక్కలు.. గోయెంకా సంబరాలు
ఫలితంగా రాజస్తాన్‌ విజయానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయింది. దీంతో లక్నో యజమాని సంజీవ్‌ గోయెంకా సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నపిల్లాడిలా గంతులేస్తూ ఆయన స్టేడియంలో సందడి చేశారు. మరోవైపు.. రాజస్తాన్‌ రాయల్స్‌ శిబిరంలో ప్రతి ఒక్కరి ముఖాలు నిరాశతో వెలవెలబోయాయి.

రాజస్తాన్‌ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అయితే ఎలాంటి స్పందనా లేకుండా.. అలాగే చూస్తూ ఉండిపోయాడు. బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ మాత్రం నెత్తికి చేతులు పెట్టుకుని నిరాశను వ్యక్తం చేశాడు. యశస్వి జైస్వాల్‌ కూడా బేలగా చూస్తూ అలా ఉండిపోయాడు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో.. ‘‘ద్రవిడ్‌ హృదయాన్ని ఆవేశ్‌ ముక్కలు చేశాడు.. గోయెంకానేమో తొలిసారి చిన్నపిల్లాడిలా గంతులేస్తున్నారు.. ఇలాంటి దృశ్యాలు అరుదు’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నాయి.

చదవండి: IPL 2025: శుబ్‌మన్‌ గిల్‌కు భారీ షాక్‌!

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)