Breaking News

ద్రవిడ్‌ మళ్లీ దరఖాస్తు చేయాల్సిందే!

Published on Sat, 05/11/2024 - 04:20

ముంబై: టి20 వరల్డ్‌ కప్‌ ముగిసిన వెంటనే భారత క్రికెట్‌ జట్టుకు కొత్త హెడ్‌ కోచ్‌ బాధ్యతలు స్వీకరిస్తారని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. దాని కోసం మరికొద్ది రోజుల్లోనే దరఖాస్తులు కోరతామని కూడా ఆయన స్పష్టం చేశారు. భారత జట్టు వరల్డ్‌ కప్‌కు బయల్దేరే ముందే ఈ ప్రక్రియ మొదలవుతుందని కూడా జై షా చెప్పారు. గత ఏడాది రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం పూర్తయిన తర్వాతే కొత్త కోచ్‌పై చర్చ జరగడంతో కొంత గందరగోళం నెలకొంది. దాంతో ద్రవిడ్‌నే మరో ఏడాది కొనసాగించారు. ఈసారి అలాంటి స్థితి రాకుండా బోర్డు ముందే జాగ్రత్త పడుతోంది. 
 
ఒప్పందం ప్రకారం వచ్చే జూన్‌లో ద్రవిడ్‌ పదవీకాలం పూర్తవుతుంది. ద్రవిడ్‌ మళ్లీ కోచ్‌గా కొనసాగాలనుకుంటే మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుందని... కొన్ని ఇతర జట్ల తరహాలో వేర్వేరు ఫార్మాట్‌లకు వేర్వేరు కోచ్‌లను ఎంపిక చేసే ఆలోచన లేదని కూడా షా పేర్కొన్నారు. 

కొత్త హెడ్‌ కోచ్‌కు మూడేళ్ల పదవీ కాలం ఇస్తామని, 2027 వన్డే వరల్డ్‌ కప్‌ వరకు అతను కొనసాగుతాడని బోర్డు కార్యదర్శి ప్రకటించారు. కోచ్‌ ఎంపిక విషయంలో క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ)దే తుది నిర్ణయమన్న షా... విదేశీ కోచ్‌ అయినా అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు.  

ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌కు చేరని జట్లలో ఉన్న ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బంది కలిసి మే 24న తొలి బృందంగా టి20 వరల్డ్‌ కప్‌ కోసం అమెరికా బయలుదేరతారని జై షా వెల్లడించారు. ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ నిబంధనను ప్రయోగాత్మకంగానే పెట్టామని, అవసరమైతే దీనిపై మళ్లీ చర్చించి కొనసాగించాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.  

మరోవైపు శ్రేయస్‌ అయ్యర్, ఇషాన్‌ కిషన్‌లను బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌ జాబితాలో చేర్చకపోవడంలో తన పాత్ర ఏమీ లేదని... ఇది పూర్తిగా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ నిర్ణయమని ఆయన సందేహ నివృత్తి చేశారు.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)