Breaking News

తీవ్రంగా గాయపడ్డ వెస్టిండీస్‌ క్రికెటర్‌.. స్ట్రెచర్‌పై మైదానం బయటకు!

Published on Tue, 02/07/2023 - 11:11

ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో భాగంగా సోమవారం జరిగిన షార్జా వారియర్స్, గల్ఫ్ జెయింట్స్ సందర్భంగా ఓ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో గల్ఫ్ జెయింట్స్ ఆటగాడు, వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డొమినిక్ డ్రేక్స్ తీవ్రంగా గాయపడ్డాడు.

ఏం జరిగిందంటే?
వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డొమినిక్ డ్రేక్స్ ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో గల్ఫ్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో షార్జా వారియర్స్ ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌ వేసిన బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో.. మోయిన్‌ అలీ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అది మిస్‌టైమ్‌ అయ్యి గాల్లోకి లేచింది.

అయితే బౌండర్‌ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న డ్రేక్‌ పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో అతడి ముఖం నేలకు బలంగా తాకింది. దీంతో వెంటనే అతడు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడు.

ఈ క్రమంలో మెడికల్‌ సిబ్బంది అతడిని స్ట్రెచర్‌పై మైదానం బయటకు తీసుకువెళ్లారు. అయితే అతడిని హూటాహూటిన ఆస్పత్రికి తరిలించారు. ఇక ముఖంకు తీవ్రమైన గాయమైనప్పటికీ అద్భుతమైన ‍క్యాచ్‌ను అందుకున్న అతడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

7 వికెట్ల తేడాతో గల్ఫ్ జెయింట్స్ విజయం
ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. షార్జా వారియర్స్‌ పై గల్ఫ్ జెయింట్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన షార్జా 107 పరుగులకే కుప్పకూలింది. గల్ఫ్ జెయింట్స్ బౌలర్లలో డేవిడ్‌ వైస్ ఐదు వికెట్లతో  షార్జా వెన్ను విరచగా.. బ్రాత్‌వైట్ రెండు, సంచిత్‌ శర్మ,హెల్మ్‌ తలా వికెట్‌ సాధించారు. అనంతరం 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన  జెయింట్స్ మూడు వికెట్లు కోల్పోయి చేధించింది.
చదవండి: Nepal Head Coach: నేపాల్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్‌

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)