Breaking News

దేశవాలీ క్రికెట్‌ సీజన్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ

Published on Sun, 06/18/2023 - 15:17

భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) 2023-24 దేశవాలీ క్రికెట్‌ సీజన్‌ షెడ్యూల్‌ను ఇవాళ (జూన్‌ 18) విడుదల చేసింది. ఈ సీజన్‌ 28 జూన్‌ 2023 నుంచి 14 మార్చి 2024 వరకు సాగనుంది. దులీప్‌ ట్రోఫీతో ప్రారంభమయ్యే ఈ సీజన్‌లో మొత్తం 1846 మ్యాచ్‌లు జరుగనున్నాయి. జూన్‌ 28న మొదలయ్యే దులీప్‌ ట్రోఫీ జులై 16న ముగుస్తుంది.

ఆ వెంటనే జులై 24-ఆగస్ట్‌ 4 మధ్యలో దియోధర్‌ ట్రోఫీ జరుగుతుంది. ఈ రెండు టోర్నీల్లో ఆరు జోన్ల జట్లు (సెంట్రల్‌, సౌత్‌, నార్త్‌, ఈస్ట్‌, వెస్ట్‌, నార్త్‌-ఈస్ట్‌) పాల్గొంటాయి. ఈ రెండు టోర్నీల తర్వాత అక్టోబర్‌ 1 నుంచి 5 వరకు రంజీ ఛాంపియన్‌ సౌరాష్ట్ర-రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా జట్ల మధ్య ఇరానీ ట్రోఫీ జరుగుతుంది. ఈ మూడు మల్టీ డే ఫార్మాట్‌ (టెస్ట్‌ ఫార్మాట్‌) టోర్నీల తర్వాత సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ (టీ20 ఫార్మాట్‌), విజయ్‌ హజారే ట్రోఫీ (వన్డే ఫార్మాట్‌) లు మొదలవుతాయి.

ముస్తాక్‌ అలీ ట్రోఫీ అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 6 వరకు జరుగనుండగా..  విజయ్‌ హజారే ట్రోఫీ నవంబర్‌ 23 నుంచి డిసెంబర్‌ 15 వరకు జరుగుతుంది. ఈ రెండు పరిమిత ఓవర్ల టోర్నీల్లో మొత్తం 38 జట్లు పోటీపడతాయి. 

2024 జనవరి 5 నుంచి రంజీ ట్రోఫీ..
2024 జనవరి 5 నుంచి ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ మొదలవుతుంది. మార్చి 14 వరకు సాగే ఈ టోర్నీలోనూ మొత్తం 38 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో మొత్తం జట్లు 5 గ్రూపులుగా (గ్రూప్‌-ఏ,బి,సీ,డీ, ప్లేట్‌) విభజించబడతాయి.

ఇక మహిళల క్రికెట్‌ విషయానికొస్తే.. సీనియర్‌ వుమెన్స్‌ టీ20 ట్రోఫీతో మహిళల డొమెస్టిక్‌ సీజన్‌ ప్రారంభమవుతుంది. ఈ టోర్నీ అక్టోబర్‌ 19 నుంచి నవంబర్‌ 9 వరకు సాగుతుంది. ఆతర్వాత నవంబర్‌ 24-డిసెంబర్‌ 4 మధ్యలో సీనియర్‌ వుమెన్స్‌ ఇంటర్‌ జోనల్‌ ట్రోఫీ జరుగుతుంది. దీని తర్వాత జనవరి 4, 2024 నుంచి సీనియర్‌ వుమెన్స్‌ వన్డే ట్రోఫీ మొదలవుతుంది. ఈ టోర్నీ జనవరి 26 వరకు సాగుతుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)