Breaking News

25వ గ్రాండ్‌స్లామ్‌ వేటలో...

Published on Mon, 08/26/2024 - 04:14

2008లో నొవాక్‌ జొకోవిచ్‌  తన తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌  ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ను గెలిచాడు. ఈ క్రమంలో వరుసగా గత 11 గ్రాండ్‌స్లామ్‌లను పంచుకున్న ఫెడరర్, నాదల్‌ జోరును నిలువరించాడు. 2011లో జొకోవిచ్‌ తొలి సారి వరల్డ్‌ నంబర్‌ వన్‌గా నిలిచిన కొత్త అధ్యాయానికి తెర తీశాడు. 

ఇప్పుడు 2024లో తన 25వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచి ఆల్‌టైమ్‌ రికార్డును సృష్టించేందుకు అతను సిద్ధమయ్యాడు. యూఎస్‌ ఓపెన్‌లో సమరానికి జొకోవిచ్‌ సై అంటున్నాడు. ట్రోఫీని అందుకొని జొకోవిచ్‌ కొత్త చరిత్ర సృష్టిస్తాడా అనేది ఆసక్తికరం.  

న్యూయార్క్‌: సీజన్‌లో చివరి గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో సెర్బియా స్టార్, వరల్డ్‌ నంబర్‌ 2 నొవాక్‌ జొకోవిచ్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. నేటి నుంచి జరిగే ఈ టోర్నీలో అతను విజేతగా నిలిస్తే మార్గరెట్‌ కోర్ట్‌ (24)ను దాటి అత్యధికంగా 25 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ సాధించిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కుతాడు. 2023లో ఇక్కడ టైటిల్‌ నెగ్గిన జొకోవిచ్‌ అదే ఫలితాన్ని పునరావృతం చేస్తే ఫెడరర్‌ (2004–08) తర్వాత టైటిల్‌ నెలబెట్టుకున్న మొదటి ఆటగాడిగా కూడా నిలుస్తాడు. 

తన తొలి రౌండ్‌లో 37 ఏళ్ల జొకోవిచ్‌ 138వ ర్యాంకర్‌ రాడు అల్బాట్‌ (మాల్డోవా)తో తలపడతాడు. 18వసారి యూఎస్‌ ఓపెన్‌లో ఆడనున్న జొకోవిచ్‌ ఈ టోర్నీలో 2005లో తొలిసారి బరిలోకి దిగి మూడో రౌండ్‌లో ఓటమి పాలయ్యాడు. అయితే 2011, 2015, 2018, 2023లలో నాలుగు సార్లు టైటిల్‌ నెగ్గిన అతను మరో ఆరుసార్లు రన్నరప్‌గా నిలిచాడు. ‘ఎప్పుడైనా గెలుపు ఒక్కటే లక్ష్యం. బాగా ఆడి ముందుగా ఫైనల్‌ వరకు చేరడం, ఆ తర్వాత టైటిల్‌ కోసం పోరాడటమే నాకు తెలుసు. ఈ తరహా దృక్పథంలో ఇప్పుడు కూడా ఎలాంటి మార్పూ లేదు’ అని జొకొవిచ్‌ అన్నాడు. 

ఇటీవలే పారిస్‌ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో స్వర్ణం గెలుచుకున్న జొకోవిచ్‌ మరింత ఉత్సాహంతో యూఎస్‌ ఓపెన్‌కు సన్నద్ధమయ్యాడు. ‘నా జీవితంలో ఒలింపిక్‌ స్వర్ణం అతి పెద్ద ఘనత. నా కల నెరవేరింది. టెన్నిస్‌ కోర్టులో అలాంటి భావోద్వేగాలు నేను ఎప్పుడూ ప్రదర్శించలేదు. అంతకుముందు సెర్బియా ఫ్లాగ్‌బేరర్‌గా నిలబడిన ఘట్టం అన్ని గ్రాండ్‌స్లామ్‌ విజయాలకంటే మిన్న. అన్నీ గెలిచేశావు కదా ఇంకా ఏం కావాలి అని కొందరు అడుగుతున్నారు. 

అయితే నాలో ఇంకా గెలవాలనే తపన  ఉంది. మరిన్ని ఘనతలు సాధించాలని కోరుకుంటా. టెన్నిస్‌ ఆడేందుకు, చూసేందుకు ఇంకా చాలా మందికి స్ఫూర్తిగా నిలవాలనుకుంటున్నా’ అని జొకోవిచ్‌ వ్యాఖ్యానించాడు. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు టెన్నిస్‌కు మూలస్తంభాల్లాంటివని... ఇలాంటి చోట బాగా ఆడేందుకు ప్రేరణ లేకపోతే ఇంకెక్కడా ఆడలేరని అభిప్రాయపడ్డాడు.   

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)