నార్వే చెస్‌ టోర్నీకి దివ్య

Published on Fri, 01/30/2026 - 04:08

స్టావెంజర్‌ (నార్వే): ప్రపంచకప్‌ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్‌ దివ్య దేశ్‌ముఖ్‌ నార్వే చెస్‌ టోర్నీలో అరంగేట్రం చేయనుంది. మహిళల ఈవెంట్‌లో 19 ఏళ్ల భారత ప్లేయర్‌ తలపడనుంది. రెండేళ్ల క్రితం 2024లో మొదలైన ఈ టోర్నీలో పోటీపడనున్న యువ క్రీడాకారిణిగా ఆమె నిలువనుంది. మే 25 నుంచి జూన్‌ 5 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. 

ప్రపంచకప్‌తో పాటు గ్రాండ్‌మాస్టర్‌ టైటిల్, మహిళల క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌కు అర్హతతో గతేడాదిని చిరస్మరణీయం చేసుకున్న ఆమె అదే ఉత్సాహాన్ని ఈ ఏడాది కొనసాగించాలని ఆశిస్తోంది. దివ్యతో పాటు ప్రపంచ మేటి చెస్‌ ప్లేయర్లంతా నార్వే చెస్‌ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. ప్రపంచ బ్లిట్జ్‌ చాంపియన్‌ బిబిసారా అసబయేవా (కజకిస్తాన్‌), డిఫెండింగ్‌ నార్వే చెస్‌ మహిళల చాంపియన్‌ అన ముజిచుక్‌ (ఉక్రెయిన్‌) తదితరులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. 

‘నార్వే ఈవెంట్‌లో పాల్గొనేందుకు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. అక్కడికి వెళ్లనుండటం కూడా ఇదే మొదటిసారి. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని దివ్య పేర్కొంది. గతేడాది జరిగిన ఈవెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, వైశాలి పాల్గొన్నారు. ఈ ఏడాది ఓపెన్‌ కేటగిరీలో ప్రజ్ఞానంద పోటీపడనున్నాడు.  

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)