Breaking News

గుకేశ్‌పై అక్కసు.. ప్రత్యర్థి కావాలనే ఓడిపోయాడంటూ

Published on Fri, 12/13/2024 - 12:31

సింగపూర్ వేదికగా జరిగిన వరల్డ్ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్ సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన 14 గేమ్‌ల పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్‌ లిరెన్‌న్‌ ఓడించి గుకేశ్ విశ్వవిజేతగా నిలిచాడు. 13 గేమ్‌లు ముగిసేసరికి ఇద్దరూ 6.5–6.5 పాయింట్లతో సమంగా ఉండగా.. నిర్ణయాత్మక​మైన ఆఖరి పోరులో గుకేశ్ తన స్కిల్స్‌ను ప్రదర్శించాడు.

అయితే ఆఖరి గేమ్ కూడా ఇద్దరి మధ్య నువ్వానేనా అన్నట్టు సాగింది. కానీ గేమ్‌ డ్రా దిశగా సాగుతున్న సమయంలో 32 ఏళ్ల లిరెన్ భారీ తప్పదం చేశాడు.  55వ ఎత్తుగడలో రూక్‌(ఏనుగు)ను ఎఫ్‌2 గడిలోకి పంపించాడు. అత‌డి పేల‌వ‌మైన మూవ్‌ చూసిన గుకేశ్ ఆశ్చ‌ర్య‌పోయాడు. 

ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకున్నాడు.  వెంట‌నే ఆ ఎనుగును త‌న ర్యాక్‌తో గుకేశ్ చెక్ పెట్టాడు. ఆ త‌ర్వాత ప్ర‌త్య‌ర్ధికి గుకేశ్ ఎటువంటి ఛాన్స్ ఇవ్వ‌లేదు. తన 58వ ఎత్తులో కింగ్‌ను ఇ5 గడిలోకి పంపి త‌న‌ విజ‌యాన్ని గుకేశ్ లాంఛ‌నం చేశాడు. అయితే గుకేశ్‌ విజయాన్ని యావత్తు భారత్‌ సెలబ్రేట్‌ చేసుకుంటుండగా.. రష్యా చెస్‌ ఫెడరేషన్‌ మాత్రం సంచలన ఆరోపణలు చేసింది. చైనా గ్రాండ్ మాస్ట‌ర్  లిరెన్‌ కావాలనే ఓడిపోయాడని  వ్యాఖ్యానించింది.

"గుకేశ్‌, లిరెన్‌న్ మ‌ధ్య జ‌రిగిన చివ‌రి గేమ్ ఫ‌లితం నిపుణులు, చదరంగం అభిమానులను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. నిర్ణయాత్మక గేమ్‌లో చైనీస్ చెస్ ఆటగాడి చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. లిరెన్‌ ఉన్న స్థితిలో అతడు ఓడిపోతాడ‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు.

అత‌డు ఓట‌మి చాలా ప్రశ్నలను లేవనెత్తుతుంది. చాలా ప్రశ్నలను లేవనెత్తుతుంది. దీనిపై అంతర్జాతీయ చెస్‌ ఫెడరేషన్‌ (ఫిడే) ప్రత్యేకంగా విచారణ జరపాలి" ర‌ష్యా చెస్ ఫెడ‌రేష‌న్ చీఫ్ ఆండ్రీ ఫిలాటోవ్ పేర్కొన్నారు. దీంతో సోషల్‌ మీడియాలో అతడిపై నెటిజన్లు మండిపడుతున్నారు. కావాలనే ఆండ్రీ భారత్‌పై విషం చిమ్ముతున్నాడని నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు.
చదవండి: ఫాస్టెస్ట్‌ సెంచరీ.. వెస్టిండీస్‌ బ్యాటర్‌ ప్రపంచ రికార్డు
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)