Breaking News

ధోనిని అధిగమించిన దినేశ్‌ కా​ర్తీక్‌

Published on Tue, 01/28/2025 - 12:30

టీమిండియా మాజీ వికెట్‌కీపర్‌, బ్యాటర్‌ దినేశ్‌ కార్తీక్‌ టీ20ల్లో ఓ భారీ రికార్డును సాధించాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిని అధిగమించాడు. టీ20ల్లో ధోని 391 మ్యాచ్‌ల్లో 7432 పరుగులు చేయగా.. డీకే 409 మ్యాచ్‌ల్లో 7451 పరుగులు సాధించాడు. 

ఐపీఎల్‌ సహా భారత క్రికెట్‌ మొత్తానికి రిటైర్మెంట్‌ ప్రకటించిన డీకే ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20 2025) ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో పార్ల్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న డీకే.. నిన్న (జనవరి 27) డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని రికార్డును అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో 15 బంతుల్లో 2 భారీ సిక్సర్ల సాయంతో 21 పరుగులు చేసిన కార్తీక్‌ మూడు పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ధోని రికార్డును బద్దలు కొట్టాడు.

39 ఏళ్ల దినేశ్‌ కార్తీక్‌ పొట్టి ఫార్మాట్‌లో 26.99 సగటున, 136.84 స్ట్రయిక్‌రేట్‌తో 34 హాఫ్‌ సెంచరీల సాయంతో 7451 పరుగులు చేశాడు. ఇందులో 718 బౌండరీలు, 258 సిక్సర్లు ఉన్నాయి. ధోని విషయానికొస్తే.. ఈ మాజీ సీఎస్‌కే కెప్టెన్‌ తన టీ20 కెరీర్‌లో 38.11 సగటున, 135.64 స్ట్రయిక్‌రేట్‌తో 28 హాఫ్‌ సెంచరీల సాయంతో 7432 పరుగులు చేశాడు. ఇందులో 517 ఫోర్లు, 338 సిక్సర్లు ఉన్నాయి. 

43 ఏళ్ల ధోనికి కార్తీక్‌ రికార్డును తిరిగి అధిగమించేందుకు మరో అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ధోని ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. తదుపరి ఐపీఎల్‌ సీజన్‌లో ధోని మరి కొన్ని పరుగులు చేసినా డీకేను అధిగమిస్తాడు.

కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్‌ రెండో ఎడిషన్‌లో డీకేకు పెద్దగా బ్యాటింగ్‌ చేసే అవకాశాలు రాలేదు. ఈ సీజన్‌లో అతను ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఐదుసార్లు మాత్రమే బ్యాటింగ్‌కు దిగాడు. ఈ ఐదు ఇన్నింగ్స్‌ల్లో కూడా నిన్న జరిగిన మ్యాచ్‌లో చేసిన స్కోరే అత్యధికం. 

కార్తీక్‌ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శనలు లేకపోయినా పార్ల్‌ రాయల్స్‌ ఈ సీజన్‌లో అదరగొట్టింది. ఈ సీజన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడింట విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. తాజా గెలుపుతో రాయల్స్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. రాయల్స్‌ చేతిలో ఓటమితో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ లీగ్‌ నుంచి నిష్క్రమించింది.

నిన్నటి మ్యాచ్‌ విషయానికొస్తే.. డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌పై పార్ల్‌ రాయల్స్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. సూపర్‌ జెయింట్స్‌ తరఫున మార్కస్‌ స్టోయినిస్‌ (40 బంతుల్లో 55 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కేన్‌ విలియమ్సన్‌ (36 బంతుల్లో 45; 5 ఫోర్లు, సిక్స్‌) రాణించారు. 

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్‌ మరో బంతి మిగిలుండగా 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్‌ జో రూట్‌ డకౌటై నిరాశపర్చగా.. డ్రి ప్రిటోరియస్‌ (43), రూబిన్‌ హెర్మన్‌ (59) రాయల్స్‌ను గెలిపించారు. చివర్లో దినేశ్‌ కార్తీక్‌ (15 బంతుల్లో 21) విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)