Breaking News

'అతడికి 300 వికెట్లు తీసే సత్తా ఉంది.. ప్రపంచకప్‌లో అదరగొడతాడు'

Published on Sat, 02/25/2023 - 18:30

టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌పై వెటరన్ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేష్‌ కార్తీక్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో సిరాజ్‌ అద్భుతంగా రాణిస్తాడని కార్తీక్‌ కొనియాడు. కాగా గత కొంత కాలంగా సిరాజ్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు.

ఈ హైదారాబాదీ ప్రస్తుతం వన్డేల్లో ప్రపంచ నెం1 బౌలర్‌గా ఉన్నాడు. అదే విధంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా సిరాజ్‌ మెరుగ్గా రాణిస్తున్నడు. మొదటి టెస్టులో మహమ్మద్ సిరాజ్ తన స్పెల్‌తో ఆసీస్‌కు చుక్కలు చూపించాడు. ఇక రెండో టెస్టులో స్పిన్నర్లు చెలరేగడంతో సిరాజ్‌కు బౌలింగ్‌ చేసే అవకాశం పెద్దగా రాలేదు.

ఈ నేపథ్యంలో కార్తీక్‌ క్రిక్‌బజ్‌ షో రైజ్‌ ఆఫ్‌ న్యూ ఇండియాలో మాట్లాడుతూ.. "సిరాజ్‌ వన్డే ప్రపంచకప్‌ భారత జట్టులో ఖచ్చితంగా భాగమవుతాడు. అతడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది మెగా ఈవెంట్‌లో అదరగొడతాడని భావిస్తున్నాను.

అయితే గతేడాది ఐపీఎల్‌ సీజన్‌ అతడికి చాలా విషయాలు నేర్పించింది. వైఫల్యాలను ఎలా ఎదుర్కొవాలో తెలుసుకున్నాడు. అదే విధంగా అతడు పూర్తి ఫిట్‌నెస్‌తో తన కెరీర్‌ను కొనసాగిస్తే.. కనీసం 300 టెస్టు వికెట్లు అయినా సాధిస్తాడు" అని కార్తీక్‌ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: గుజరాత్‌ టైటాన్స్‌కు ఊహించని షాక్‌.. రూ.4 కోట్ల ఆటగాడు దూరం!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)