Breaking News

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడ‌నున్న దినేష్ కార్తీక్‌.. తొలి భార‌త క్రికెట‌ర్‌గా

Published on Tue, 08/06/2024 - 11:28

భార‌త మాజీ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ దినేష్ కార్తీక్‌ ద‌క్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో భాగం కానున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2025 సీజ‌న్‌లో పార్ల్ రాయ‌ల్స్‌ త‌ర‌పున కార్తీక్ ఆడ‌నున్నాడు. వ‌చ్చే ఏడాది సీజ‌న్‌కు గాను విదేశీ ప్లేయ‌ర్ కోటాలో డీకేతో పార్ల్ రాయ‌ల్స్  ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకుంది.

త‌ద్వారా ఎస్ఎ టీ20లో ఆడ‌నునున్న తొలి భారత ఆట‌గాడిగా కార్తీక్ నిలిచాడు. కాగా ఐపీఎల్‌-2024 అనంత‌రం అన్నిరకాల క్రికెట్‌ ఫార్మాట్‌ల‌కు కార్తీక్ విడ్కోలు ప‌లికాడు. కాగా భారత క్రికెట‌ర్లు విదేశీ లీగ్‌ల్లో ఆడాలంటే క‌చ్చితంగా అన్ని ఫార్మాట్ల‌కు ఖ‌చ్చితంగా రిటైర్మెంట్ ప్ర‌క‌టించాల్సిందే. 

ఈ క్ర‌మంలోనే కార్తీక్‌కు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడే ఛాన్స్ ల‌భించింది. ఇక ఇటీవ‌లే ఎస్ఎ టీ20 టోర్నమెంట్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా కార్తీక్ ఎంపిక‌య్యాడు. కాగా టీ20ల్లో కార్తీక్‌కు అపార‌మైన అనుభవం ఉంది. త‌న కెరీర్‌లో 401 టీ20లు ఆడిన డీకే.. 136.96 స్ట్రైక్-రేట్‌తో 7407 పరుగులు చేశాడు. 

ఐపీఎల్‌లో ఏకంగా ఆరు జ‌ట్ల‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. అదే విధంగా భార‌త్ త‌రుప‌న దినేష్ 180 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. కాగా డీకేతో పాటు ఇంగ్లండ్ వెట‌ర‌న్ క్రికెట‌ర్‌ జో రూట్‌ను కూడా పార్ల్ రాయ‌ల్స్ సొంతం చేసుకుంది. ఇక‌ ద‌క్షిణాఫ్రికా టీ20 లీగ్ మూడో సీజ‌న్ వచ్చే ఏడాది జ‌న‌వ‌రి 9 నుంచి ఫిబ్ర‌వ‌రి 8 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.

పార్ల్ రాయల్స్ జట్టు
డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, బ్జోర్న్ ఫోర్టుయిన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, దినేష్ కార్తీక్, మిచెల్ వాన్ బ్యూరెన్, కోడి యూసుఫ్, కీత్ డడ్జియోన్, న్కాబా పీటర్, క్వేనా మఫాకా, లువాన్-డ్రే ప్రిటోరియస్, దయాన్ గలీమ్
చదవండి: 'గంభీర్ ఒక చిన్న పిల్లాడు.. ఓటమిని అస్సలు జీర్ణించు​కోలేడు'

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)