Breaking News

ధోనీ విషయంలో తప్పు చేశాను, క్షమించండి: దినేశ్ కార్తీక్

Published on Fri, 08/23/2024 - 13:04

టీమిండియా మాజీ వికెట్‌కీపర్‌, బ్యాటర్‌ దినేశ్‌ కార్తీక్‌ గత వారం తన ఆల్‌టైమ్‌, ఆల్‌ ఫార్మాట్‌ ఫేవరెట్‌ టీమిండియాను ప్రకటించాడు. ఇందులో రోహిత్‌ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌, సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లి, యువరాజ్‌ సింగ్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, అనిల్‌ కుంబ్లే, జస్ప్రీత్‌ బుమ్రా, జహీర్‌ ఖాన్‌ సభ్యులుగా ఉన్నారు. అయితే ఆశ్చర్యకరంగా డీకే ఈ జాబితాలో ఎంఎస్‌ ధోనికి చోటివ్వలేదు. ఈ కారణంగా అతను ధోని అభిమానుల నుంచి దారుణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో డీకే తాజా వివరణ ఇచ్చాడు.

ధోని విషయంలో చాలా పెద్ద తప్పు చేశానని ఒప్పుకున్నాడు. పొరపాటున ధోని పేరును లిస్ట్‌లో చేర్చలేదని వివరణ ఇచ్చాడు. స్వతహాగా వికెట్‌కీపర్‌ను అయి ఉండి, ధోని పేరును చేర్చకపోవడం నిజంగా పెద్ద పొరపాటని అన్నాడు. రాహుల్‌ ద్రవిడ్‌ జట్టులో ఉండటంతో అందరూ అతనే వికెట్‌కీపర్‌ అనుకున్నారని పేర్కొన్నాడు. ఈ అంశానికి సంబంధించిన ఎపిసోడ్‌ బయటికి వచ్చే వరకు ధోనిని ఎంపిక చేయలేదని తనకు కూడా తెలీదని వివరణ ఇచ్చాడు. జట్టు ఎంపిక సమయంలో తన మదిలో చాలా విషయాలు ఉన్నాయని, అందుకే పొరపాటు జరిగిందని అన్నాడు.

తన జట్టులో ధోని తప్పనిసరిగా ఉంటాడని తెలిపాడు. ధోని ఏడో స్థానంలో వికెట్‌కీపర్‌గా మాత్రమే కాకుండా జట్టుకు నాయకుడిగా కూడా వ్యవహరిస్తాడని అన్నాడు. ధోని ఈ జట్టులోనే కాదు, తాను ఎంపిక చేసే ఏ జట్టులోనైనా ఉంటాడని తెలిపాడు. కాగా, ధోని నేతృత్వంలో టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ‌లను గెలిచిన విషయం తెలిసిందే.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)