Breaking News

గుండెపోటుతో భారత మాజీ క్రికెట‌ర్ క‌న్నుమూత‌

Published on Tue, 06/24/2025 - 07:34

భార‌త క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ దిలీప్‌ దోషి (77) సోమవారం లండన్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. 32 ఏళ్ల వయసులో ఆయనకు తొలిసారి భారత్‌ జట్టు తరఫున ఆడే అవకాశం దక్కింది. 1979–1983 మధ్య కాలంలో 33 టెస్టులు ఆడి 114 వికెట్లు పడగొట్టిన దిలీప్‌ దోషి...15 వన్డేల్లో 22 వికెట్లు తీశారు.

1981లో మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్టులో ఆ్రస్టేలియాపై భారత జట్టు చారిత్రాత్మక విజయంలో దిలీప్‌ 5 వికెట్లతో కీలక పాత్ర పోషించారు. దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర, బెంగాల్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఆయన సుదీర్ఘ కాలం ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో వార్విక్‌షైర్‌, నాటింగ్‌హామ్‌షైర్‌ జట్ల తరఫున ఆడారు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తర్వాత లండన్‌లోనే శాశ్వత నివాసం ఏర్పరచుకున్నారు. 

కెరీర్‌ అత్యుత్తమ దశలో ఉన్నప్పుడు కూడా భారత్‌ జట్టులో బిషన్‌సింగ్‌ బేడి హవా నడుస్తుండటంతో దిలీప్‌కు ఎక్కువగా టెస్టులు ఆడే అవకాశం రాలేదు. ‘స్పిన్‌ పంచ్‌’ పేరుతో ఆయన ఆటోబయోగ్రఫీ వచ్చింది. దిలీప్‌ మృతి పట్ల బీసీసీఐ సంతాపం వ్యక్తం చేసింది.

కాగా ఆయ‌న కుమారుడు న‌య‌న్ జోషీ సైతం స‌ర్రే, సౌరాష్ట్ర త‌ర‌పున ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. దోషీ మృతికి సంతాపంగా లీడ్స్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ఐదు రోజు ఆటలో భారత్‌-ఇంగ్లండ్‌ ఆటగాళ్లు బ్లాక్‌ బ్యాండ్స్‌ భుజానికి కట్టుకుని బరిలోకి దిగనున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)