Breaking News

ఆర్సీబీపై చాహల్‌ గరం గరం.. నమ్మించి మోసం చేశారు! కనీసం ఒక్క ఫోన్‌ కాల్‌ కూడా..

Published on Sun, 07/16/2023 - 16:53

భారత స్టార్‌ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ ఐపీఎల్‌లో 8 ఏళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్‌-2022 మెగా వేలంకు ముందు చాహల్‌ను ఆర్సీబీ రీటైన్‌ చేసుకోలేదు. ఈ క్రమంలో వేలంలోకి వచ్చిన చాహల్‌ను కనీసం మళ్లీ తిరిగి పొందే ప్రయత్నం కూడా ఆర్సీబీ చేయలేదు. 

అయితే ఈ వేలంలో చాహల్‌ను సంజూ శాంసన్‌ సారధ్యంలోని రాజస్తాన్‌ రాయల్స్‌ రూ. 6.50 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇక వేలంలో తనను పట్టించుకోని ఆర్సీబీపై తాజాగా చాహల్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 8 సీజన్ల పాటు సేవలు అందించిన తనను విడిచిపెట్టడం చాలా బాధ కలిగించిందని చాహల్‌ తెలిపాడు. "నన్ను రిటైన్ చేసుకోలేదనే విషయం తెలియగానే చాలా బాధపడ్డాను.  2014లో ఆర్సీబీతో నా ప్రయాణం మొదలైంది. అప్పటి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తొలి మ్యాచ్‌ నుంచే నాపై నమ్మకం ఉంచాడు.

నేను 8 ఏళ్ల పాటు ఆర్సీబీ ఫ్రాంచైజీ తరపున ఆడాను.  2022 వేలానికి ముందు  నేను మేనేజ్‌మెంట్‌ను ఎక్కువ డబ్బులు అడిగానని  నాపై విమర్శలు వచ్చాయి. నేను అలా చేయలేదని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చా. దాదాపు 140 మ్యాచ్‌లు పైగా ఆర్సీబీ తరపున ఆడాను. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం అంటే నాకు చాలా ఇష్టం.

ఆర్సీబీ నన్ను ఎందుకు సొంతం చేసుకోలేదో ఇప్పటికి నాకు అర్దం కాలేదు. రిటైన్‌ చేసుకోపోనప్పటికీ వేలంలో కచ్చితంగా కొనుగోలు చేస్తా​మని మాట ఇచ్చారు. కానీ వేలంలో కనీస ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత వారి నుంచి కనీసం ఒక్క ఫోన్‌ కాల్‌ కూడా రాలేదు. 

ఈ విషయం గుర్తు తెచ్చుకున్న ప్రతీసారి నాకు బాధ కలుగుతోంది. ఆ తర్వాత ఏది జరిగినా అది నా మంచికే అని భావించాను. రాజస్తాన్‌ రాయల్స్‌లో చేరడం వల్ల నేను డెత్ బౌలర్‌గా మారాను. ఆర్సీబీలో ఉన్నప్పుడు నా ఓవర్ల కోటా  దాదాపు 16 లేదా 17 ఓవర్‌కే పూర్తయ్యేది.  కానీ రాజస్తాన్‌లో చేరాక నా  ప్రదర్శన 5 - 10 శాతం ఇంప్రూవ్ అయింది" అని ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అలహబాదియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్‌ పేర్కొన్నాడు.
చదవండి: Asian Games 2023: భారత సెలక్టర్లు చాలా పెద్ద తప్పుచేశారు.. అతడు జట్టులో ఉండాల్సింది

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)