Breaking News

బెయిర్‌ స్టో ఔట్‌ వివాదం.. మొదలుపెట్టింది ఇంగ్లండే కదా!

Published on Mon, 07/03/2023 - 15:27

లార్డ్స్‌ వేదికగా ముగిసిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే విజయం కన్నా బెయిర్‌ స్టో ఔట్‌ వివాదాస్పదంగా మారింది. ఆసీస్‌ వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ చేసిన పని క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. 

ఐదోరోజు ఆటలో లంచ్‌ విరామానికి ముందు గ్రీన్‌ వేసిన బంతిని ఆడకుండా కిందకు వంగిన బెయిర్‌స్టో ఆ తర్వాత సహచరుడు స్టోక్స్‌తో మాట్లాడేందుకు ముందుకు వెళ్లాడు. అదే సమయంలో బంతిని అందుకున్న కీపర్‌ క్యారీ అండర్‌ఆర్మ్‌ త్రోతో ముందుకు విసరగా అది స్టంప్స్‌ను తాకింది. ఆ సమయంలో బెయిర్‌స్టో క్రీజ్‌కు చాలా దూరం ఉండడంతో థర్డ్‌ అంపైర్‌ బెయిర్‌స్టోన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దాంతో ఇంగ్లండ్‌ బృందం ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యింది. ఆసీస్‌ తమ అప్పీల్‌ను కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయకపోవడంతో బెయిర్‌స్టో మైదానం వీడాడు. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లపై స్టేడియంలోని ప్రేక్షకులు చీటర్స్‌ అంటూ దూషణల పర్వం మొదలుపెట్టారు.


అయితే బెయిర్‌ స్టో ఇదే లార్డ్స్‌ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో మార్నస్‌ లబుషేన్‌ను ఇలాగే ఔట్‌ చేసే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. బంతి మిస్సయ్యి కీపర్‌ బెయిర్‌ స్టో చేతుల్లోకి వెళ్లినా లబుషేన్‌ క్రీజులోనే ఉన్నాడు. త్రో వేయాలన్న ఉద్దేశంతో బెయిర్‌ స్టో నేరుగా వికెట్ల వైపు విసిరాడు. అయితే లబుషేన్‌ క్రీజులోనే ఉండడంతో అది ఔట్‌గా పరిగణించలేదు. ఒకవేళ లబుషేన్‌ క్రీజు దాటి బయట ఉంటే అప్పుడు బెయిర్‌ స్టో అప్పీల్‌కు వెళ్లేవాడా లేక క్రీడాస్పూర్తి ప్రదర్శించేవాడా అంటే చెప్పలేని పరిస్థితి.

అంటే ఈ లెక్కన చూస్తే  ఇంగ్లండ్‌ కీపర్‌ బెయిర్‌ స్టోనే తొలుత ఇది మొదలుపెట్టాడనిపిస్తుంది. ఆ సమయంలో అలెక్స్‌ క్యారీ గమనించాడేమో తెలియదు కానీ.. తనకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం క్రీడాస్పూర్తిని పక్కకుబెట్టి బెయిర్‌ స్టోను ఔట్‌ చేశాడు. గెలుపు కోసం ప్రయత్నిస్తున్న ఏ జట్టైనా అలాగే చేస్తుందని.. ఆసీస్‌ను చీటర్స్‌ అని పిలుస్తున్నారు కానీ అదే స్థానంలో ఇంగ్లండ్‌ ఉండుంటే కూడా బహుశా అదే జరిగేదేమో అని కొంతమంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

చదవండి: Ashes 2023: నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం.. వాళ్లు ఛీటర్స్‌! ఆస్ట్రేలియాకు ఇది అలవాటే

బెయిర్‌స్టో వివాదాస్పద స్టంపౌట్‌పై బెన్‌ స్టోక్స్‌.. అలాంటి గెలుపు మాకొద్దు..!

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)