Breaking News

సెల‌క్ట‌ర్లకు వార్నింగ్‌.. భారీ సెంచరీతో చెలరేగిన ధ్రువ్‌ జురెల్‌

Published on Mon, 12/29/2025 - 13:18

న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌కు భార‌త జ‌ట్టును బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ మ‌రో నాలుగు రోజుల్లో ప్ర‌క‌టించ‌నుంది. ఈ నేప‌థ్యంలో సెల‌క్ట‌ర్ల‌కు టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌ ధ్రువ్ జురెల్ సూప‌ర్‌ సెంచ‌రీతో స‌వాల్ విసిరాడు. విజ‌య్ హజారే ట్రోఫీ 2025-26లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ధ్రువ్ జురెల్‌.. రాజ్‌కోట్‌లో బ‌రోడా జ‌రుగుతున్న మ్యాచ్‌లో భారీ సెంచ‌రీతో చెల‌రేగాడు.

మూడో స్దానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన ధ్రువ్.. టీ20 త‌ర‌హాలో ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. ఓ వైపు వికెట్లు ప‌డ‌తున్న‌ప్ప‌టికి అత‌డు మాత్రం త‌న జోరును త‌గ్గించ‌లేదు. యూపీ కెప్టెన్ రింకూ సింగ్‌తో క‌లిసి స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. ఈ క్ర‌మంలో జురెల్ కేవ‌లం 78 బంతుల్లోనే త‌న‌ తొలి లిస్ట్‌-ఎ క్రికెట్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు.

ఓవ‌రాల్‌గా ఓవరాల్‌గా 101 బంతులు ఎదుర్కొన్న జురెల్‌.. 15 ఫోర్లు, 8 బంతుల్లో 160 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రింకూ సింగ్‌ 67 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన యూపీ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 369 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. బరోడా బౌలర్లలో యువ పేసర్‌ రాజ్‌ లింబానీ నాలుగు వికెట్లతో చెలరేగాడు.

రేసులో కిషన్‌-డిజే
కాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టులో సెకెండ్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఎవరికి చోటు దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. కేఎల్ రాహుల్ మెయిన్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఉండగా.. అతడికి బ్యాకప్‌గా కిషన్‌-పంత్‌-జురెల్ మధ్య పోటీ నెలకొంది. అయితే పంత్‌ను వన్డే జట్టు నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో కిషన్‌-జురెల్‌లో ఎవరికో ఒకరికి చోటు దక్కే అవకాశముంది. ఇద్దరూ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. జురెల్ గత కొన్ని సిరీస్‌ల‌కు వ‌న్డే జ‌ట్టులో ఉన్న‌ప్ప‌టికి.. ఇప్ప‌టివ‌ర‌కు మాత్రం ఇంకా డెబ్యూ చేయ‌లేదు. కిష‌న్ కూడా ఈ దేశ‌వాళీ వ‌న్డే టోర్నీ తొలి మ్యాచ్‌లోనే శ‌త‌క్కొట్టాడు. దీంతో సెల‌క్ట‌ర్లు మ‌రి ఎవ‌రి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.
చదవండి: ఆస్ట్రేలియా బ్యాటర్‌ విధ్వంసం.. టీ20ల్లో ఫాస్టెస్ట్‌ ఫిప్టీ!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)