Breaking News

ధృవ్‌ జురెల్‌ మరో హాఫ్‌ సెంచరీ.. 229 పరుగులకు భారత్‌ ఆలౌట్‌

Published on Sat, 11/09/2024 - 09:44

మెల్‌బోర్న్ వేదిక‌గా ఆస్ట్రేలియా-ఎ జ‌ట్టుతో జ‌రుగుతున్న రెండో ఆనాధిక‌రిక టెస్టులో భారత‌-ఎ జ‌ట్టును వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ధృవ్ జురెల్ మ‌రోసారి ఆదుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా జురెల్ హాఫ్ సెంచరీ సాధించాడు. తన అద్బుత ఇన్నింగ్స్‌తో భారత్‌కు ఫైటింగ్ స్కోర్‌ను అందించాడు.

122 బంతులు ఎదుర్కొన్న జురెల్ 5 ఫోర్లతో 68 పరుగులు చేశాడు. అతడితో పాటు తనీష్ కొటియన్‌(44), నితీష్ కుమార్ రెడ్డి(38) పరుగులతో రాణించారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 229 పరుగులకు ఆలౌటైంది. 75/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత-ఎ జట్టు అదనంగా 154 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.

దీంతో ఆస్ట్రేలియా ముందు 168 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉంచింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ కేవలం ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయింది. ప్రసిద్ద్‌ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టి భారత్‌కు శుభారంభం ఇచ్చాడు.

భారత ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు.. 
ఇక రెండు ఇన్నింగ్స్‌లోనూ హాఫ్‌ సెంచరీలతో రాణించిన ధృవ్‌ జురెల్‌ను పెర్త్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టులో ఆడించాలని భారత జట్టు మేనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మిడిలార్డర్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌పై వేటు వేసి జురెల్‌కు చోటు ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా పరిస్థితులకు తగ్గట్టు ఆడుతున్న జురెల్‌ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)