Breaking News

అందుకే అలా చేశా.. అతడు మా జట్టుకు దొరికిన నిజమైన ఆస్తి! అద్భుతాలు సృష్టిస్తాడు: ధోని

Published on Sun, 05/07/2023 - 12:21

ఐపీఎల్‌-2023లో భాగంగా చెపాక్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యచ్‌లో 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించిన సంగతి  తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ధోని సేన.. పాయిం‍ట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. 140 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే.. రుత్‌రాజ్‌, కాన్వే చెలరేగడంతో 17.4 ఓవర్లలో ఛేదించింది.

ఇక ఈ అద్భుత విజయంపై మ్యాచ్‌ అనంతరం సీఎస్‌కే కెప్టెన్‌ ఎంస్‌ ధోని స్పందించాడు. కీలకమైన మ్యాచ్‌లో గెలుపొందినందుకు చాలా సంతోషంగా ఉంది తలైవా తెలిపాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లతో అదరగొట్టిన యువ పేసర్‌ మతీషా పతిరానాపై కూడా మిస్టర్‌ కూల్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. "ఈ విజయం చాలా కీలకం. గత కొన్ని మ్యాచ్‌ల్లో ఫలితాలు మాకు అనుకూలంగా లేవు.

కాబట్టి పాయింట్ల పట్టికలో మేము కాస్త వెనుకబడ్డాం. ఇప్పుడు మళ్లీ ఈ విజయంతో ముందుకు వెళ్లడం చాలా సంతోషంగా ఉంది. ఇక టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోవాలని భావించాను. కానీ వర్షం వచ్చే అవకాశం ఉండడంతో నా నిర్ణయాన్ని ఆఖరి నిమిషంలో మార్చుకున్నాను. అందుకే తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాను. అదేవిధంగా వికెట్‌ కూడా చాలా నెమ్మదిగా ఉంది.

కాబట్టి నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అని మా బౌలర్లు కూడా నిరూపించారు. మా పేసర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ముఖ్యంగా పతిరానా మా జట్టుకు, శ్రీలంకకు దొరికిన నిజమైన ఆస్తి. అతడు రెడ్‌ బాల్‌ క్రికెట్‌ కాకుండా వైట్‌ బాల్‌ క్రికెట్‌లో మాత్రమే ఆడేటట్లు శ్రీలంక క్రికెట్‌ చూసుకోవాలి. అతడికి అద్భుతాలు సృష్టించే సత్తా ఉంది. అదే విధంగా అతడు గత సీజన్‌ కంటే ఈ సీజన్‌లో కాస్త దృఢంగా ఉన్నాడని" పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో ధోని పేర్కొన్నాడు.
చదవండి: Kris Srikkanth: రోహిత్‌ శర్మ కాదు 'నో హిట్‌ శర్మ' అని పేరు మార్చుకో.. నేనైతే నిన్ను జట్టులోకి కూడా తీసుకోను..!

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)