Breaking News

చాంపియన్స్‌ ధీరజ్, దీపికా కుమారి

Published on Sat, 12/21/2024 - 03:50

జంషెడ్‌పూర్‌: ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ బొమ్మదేవర ధీరజ్‌ జాతీయ సీనియర్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. పారిస్‌ ఒలింపిక్స్‌లో మెగురైన ప్రదర్శన కనబర్చినా... పతకం సాధించలేకపోయిన ఈ ఆంధ్ర ఆర్చర్‌.. జాతీయ టోర్నీలో పెద్దగా పోటీ ఎదుర్కోకుండానే స్వర్ణం గెలుచుకున్నాడు. శుక్రవారం జరిగిన రికర్వ్‌ సింగిల్స్‌ ఫైనల్లో ధీరజ్‌ 6–2తో హరియాణాకు చెందిన దివ్యాన్‌‡్ష చౌధరిపై విజయం సాధించాడు. 

తొలి రెండు సెట్‌లలో వెనుకబడిన ధీరజ్‌ ఆ తర్వాత పుంజుకొని అదరగొట్టాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన అతుల్‌ వర్మ కాంస్యం గెలుచుకున్నాడు. మహిళల విభాగంలో నాలుగుసార్లు ఒలింపియన్‌ దీపికా కుమారి చాంపియన్‌గా నిలిచింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో తన సహచర ఆర్చర్‌ అకింత భకత్‌పై విజయంతో దీపికా కుమారి పసిడి పతకం కైవసం చేసుకుంది.

శుక్రవారం ఫైనల్లో దీపిక 6–2తో అంకితపై గెలిచింది. సిమ్రన్‌జీత్‌ కౌర్‌కు కాంస్యం దక్కింది. మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లోనూ దీపిక స్వర్ణం గెలిచింది. తన భర్త అతాను దాస్‌తో కలిసి పెట్రోలియం స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు (పీఎస్‌పీబీ) జట్టు తరఫున బరిలోకి దిగింది. ఫైనల్లో పీఎస్‌పీబీ 6–2తో పంజాబ్‌ టీమ్‌పై విజయం సాధించింది.  

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)