శ్రీలంక టెస్టు కెప్టెన్‌గా స్టార్‌ ఆల్‌రౌండర్‌..

Published on Thu, 01/04/2024 - 10:34

స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు ముందు శ్రీలంక క్రికెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తమ టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా స్టార్‌ ఆల్‌రౌండర్‌ ధనంజయ డి సిల్వాను శ్రీలంక క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. టెస్టుల్లో శ్రీలంక జట్టుకు సారథ్యం వహించనున్న 18 ఆటగాడిగా డి సిల్వా నిలిచాడు. దిముత్ కరుణరత్నే స్ధానాన్ని ధనంజయ భర్తీ చేయనున్నాడు. 

కాగా గతేడాది జాలైలో పాకిస్తాన్‌ టెస్టు సిరీస్‌ అనంతరం దిముత్ కరుణరత్నే శ్రీలంక కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.  ఈ క్రమంలోనే టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను ధనంజయ డి సిల్వాకు శ్రీలంక క్రికెట్‌  అప్పగించింది. అదే విధంగా అతడికి డిప్యూటీగా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కుశాల్‌ మెండిస్ వ్యవహరించనున్నాడు.

కాగా ఈ నెలఖారులో అఫ్గాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇక కొత్త కెప్టెన్‌గా ఎంపికైన ధనంజయ డి సిల్వా 51 టెస్టుల్లో 39.77 సగటుతో 3,301 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 10 సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా టెస్టు‍ల్లో అతడికి 34 వికెట్లు కూడా ఉన్నాయి.

కాగా ఇటీవలే వన్డే, టీ20లకు ఇద్దరూ వేర్వేరు కెప్టెన్లను శ్రీలంక క్రికెట్‌ నియమించింది. జింబాబ్వేతో వైట్‌బాల్‌ సిరీస్‌ నేపథ్యంలో తమ జట్టు టీ20 కెప్టెన్‌గా వనిందు హసరంగా, వన్డే కెప్టెన్‌గా కుశాల్‌ మెండిస్‌ను ఉపుల్‌ తరంగా నేతృత్వంలోని లంక సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది.
చదవండి: IND vs SA 2nd Test: చరిత్ర సృష్టించిన కేప్‌ టౌన్‌ టెస్టు.. 134 ఏళ్ల రికార్డు బద్దలు

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)