Breaking News

తొలి మ్యాచ్‌లోనే ఇరగదీసిన సీఎస్‌కే చిచ్చరపిడుగు బ్రెవిస్‌

Published on Sun, 06/01/2025 - 16:31

సీఎస్‌కే చిచ్చరపిడుగు డెవాల్డ్‌ బ్రెవిస్‌ ఇంగ్లండ్‌ టీ20 లీగ్‌లో (వైటాలిటి టీ20 బ్లాస్ట్‌ 2025) తన తొలి మ్యాచ్‌లోనే ఇరగదీశాడు. ఈ లీగ్‌లో హ్యాంప్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రెవిస్‌.. ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర అర్ద శతకంతో విరుచుకుపడ్డాడు. 32 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశాడు. బ్రెవిస్‌తో పాటు టాబీ ఆల్బర్ట్‌ (54), జేమ్స్‌ విన్స్‌ (62) కూడా మెరుపు అర్ద శతకాలతో చెలరేగడంతో హ్యాంప్‌షైర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 230 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

హ్యాంప్‌షైర్‌ ఇన్నింగ్స్‌లో హోవెల్‌ 11, జేమ్స్‌ ఫుల్లర్‌ 4, వెథర్లీ 3, టామ్‌ ప్రెస్ట్‌ 3 పరుగులకు ఔట్‌ కాగా.. లియామ్‌ డాసన్‌ 19, వుడ్‌ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. ఎసెక్స్‌ బౌలర్లలో మహ్మద్‌ ఆమిర్‌, వాల్టర్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. సామ్‌ కుక్‌, హార్మర్‌, క్రిచ్లే తలో వికెట్‌ తీశారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎసెక్స్‌ ఏమాత్రం పోరాడకుండానే చేతులెత్తేసింది. డాసన్‌ (4-0-26-4), స్టార్‌ కర్రీ (2.2-0-20-2) చెలరేగడంతో ఆ జట్టు 16.2 ఓవర్లలో 124 పరుగులకే చాపచుట్టేసింది. ఫుల్లర్‌, హోవెల్‌ కూడా తలో వికెట్‌ తీశారు. ఎసెక్స్‌ ఇన్నింగ్స్‌లో కైల్‌ పెప్పర్‌ ఒక్కడే అర్ద సెంచరీతో (51) రాణించాడు. రొస్సింగ్టన్‌ (18), వాల్టర్‌ (23) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. డీన్‌ ఎల్గర్‌ 0, క్రిచ్లీ 4, అల్లీసన్‌ 0, బెన్‌కెన్‌స్టెయిన్‌ 6, హార్మర్‌ 2, స్నేటర్‌ 5, ఆమిర్‌ 3 పరుగులకు ఔటయ్యారు.

ఐపీఎల్‌ 2025లో అదరగొట్టిన బ్రెవిస్‌
ఐపీఎల్‌ 2025లో లేట్‌గా రంగప్రవేశం​ చేసిన డెవాల్డ్‌ బ్రెవిస్‌ ఈ సీజన్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనే తన తడాఖా చూపించాడు. ఈ మ్యాచ్‌లో అతను 180 స్ట్రయిక్‌రేట్‌తో రెండు హాఫ్‌ సెంచరీల సాయంతో 225 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో బ్రెవిస్‌ ఆడిన ఇన్నింగ్స్‌లు వచ్చే సీజన్‌లో సీఎస్‌కే ప్రయాణానికి జీవం పోశాయి. బ్రెవిస్‌ను ఈ సీజన్‌లో సీఎస్‌కే రీప్లేస్‌మెంట్‌ ఆటగాడిగా తీసుకుంది. రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)