Breaking News

విండీస్ క్రికెట‌ర్‌కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.... ఐదేళ్ల పాటు నిషేధం

Published on Thu, 05/02/2024 - 20:36

వెస్టిండీస్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌ డెవాన్ థామస్ అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బిగ్ షాకిచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డినందుకు థామస్‌పై ఐసీసీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. శ్రీలంక క్రికెట్ (SLC), ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ECB), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) అవినీతి నిరోధక నిబంధ‌న‌లను థామ‌స్ ఉల్లంఘించ‌డంతో ఐసీసీ ఈ నిర్ణ‌యం తీసుకుంది. 

థామస్ కూడా త‌న నేరాన్ని అంగీకరించిన‌ట్లు ఐసీసీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. లంక ప్రీమియిర్‌ లీగ్‌ 2021లో ఫిక్సింగ్‌ పాల్పడ్డాడన్న అభియోగాల నేప‌థ్యంలో గ‌తేడాది థామస్‌పై ఐసీసీ తాత్కాలికంగా సస్సెన్షన్‌ వేటు వేసింది. అదే విధంగా యూఏఈ, కరీబియన్‌ లీగ్‌లో బుకీలు క‌లిసిన‌ట్లు అత‌డిపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. 

అయితే ఇప్పుడు నేరం రుజువు కావ‌డంతో ఐదేళ్ల పాటు ఎటువంటి క్రికెట్ ఆడ‌కుండా అత‌డిపై ఐసీసీ బ్యాన్ విధించింది. ఇక విండీస్‌ తరఫున డెవాన్‌ ఒక టెస్ట్‌, 21 వన్డేలు, 12 టీ20లు ఆడాడు. ఇందులో మొత్తంగా 320 పరుగులు, 36 క్యాచ్‌లు, 4 రనౌట్లు, 8 స్టంపింగ్‌లు చేశాడు. టెస్ట్‌ల్లో, వన్డేల్లో బౌలింగ్‌ సైతం చేసిన థామస్‌.. ఫార్మాట్‌కు 2 చొప్పున 4 వికెట్లు పడగొట్టాడు.


 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)