Breaking News

టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అరుదైన రికార్డు..

Published on Thu, 06/03/2021 - 20:14

లండన్‌: న్యూజిలాండ్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ డెవాన్‌ కాన్వే అరంగేట్రం ఇన్నింగ్స్‌తోనే ప్రపంచ క్రికెట్‌ దృష్టిని ఆకర్శించాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో తన అరంగేట్రం ఇన్నింగ్స్‌లోనే డబుల్‌ సెంచరీ సాధించి, టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఈ అరుదైన ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో టిప్‌ ఫోస్టర్‌(287), జాక్‌ రుడాల్ఫ్‌(222*), లారెన్స్‌ రోవ్‌(214), మాథ్యూ సింక్లెయిర్‌(214), బ్రెండన్‌ కురుప్పు(201*)లు టెస్ట్‌ డెబ్యూలో డబుల్‌ కొట్టారు.

మాథ్యూ సింక్లెయిర్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో కివీస్‌ ఆటగాడిగా కాన్వే రికార్డు నెలకొల్పాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో కాన్వే మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్‌ డెబ్యూలో బౌండరీతో సెంచరీని, సిక్సర్‌తో ద్విశతకాన్ని సాధించిన తొలి ఆటగాడిగా చరిత్రపుటల్లోకెక్కాడు. అంతకుముందు తొలి రోజు ఆటలో లార్డ్స్‌ మైదానంలో గంగూలీ 25 ఏళ్ల కిందట నెలకొల్పిన రికార్డును బద్దలుకొట్టిన కాన్వే.. తాజాగా డబుల్‌ సాధించి అరుదైన క్రికెటర్ల క్లబ్‌లోకి చేరాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో కాన్వే(347 బంతుల్లో 200; 22 ఫోర్లు, సిక్స్‌) ఒక్కడే ద్విశతకంతో పోరాడటంతో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. అతనికి హెన్నీ నికోల్స్‌(61), నీల్‌ వాగ్నర్‌(25 నాటౌట్‌) సహకరించడంతో కివీస్‌ గౌరవప్రదమైన స్కోర్‌ సాధించగలిగింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో అరంగేట్రం బౌలర్‌ రాబిన్సన్‌ 4 వికెట్లు పడగొట్టగా, మార్క్‌ వుడ్‌ 3, అండర్సన్‌ 2 వికెట్లు పడగొట్టారు.
చదవండి: కోహ్లీతో నన్ను పోల్చకండి.. అతని స్టైల్‌ వేరు, నా స్టైల్‌ వేరు

Videos

వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు

Miss World 2025: అందం అంటే..!

Ambati: చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు బాధ పడుతున్నారు

హైదరాబాద్ మెట్రోరైలు ఛార్జీలు పెంపు

చంద్రబాబు ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్రకార్యదర్శి శ్రీనివాసరావు ఆగ్రహం

భారత్‌కు షాక్ మీద షాక్ ఇస్తున్న ట్రంప్

వ్యాపారులను బెదిరిస్తూ వసూళ్ల పర్వానికి తెరలేపిన పచ్చ నేతలు

జమ్మూలో మళ్లీ మొదలైన ఉగ్రవేట ఉగ్రవాదులను పట్టించిన డ్రోన్

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఏపీలో రాక్షస పాలన సాగుతోంది: మాజీ MLA రవీంద్రనాథ్ రెడ్డి

Photos

+5

సరస్వతి పుష్కరాలు.. కాళేశ్వరంలో సీఎం రేవంత్‌ పర్యటన (ఫొటోలు)

+5

Miss World 2025 : యాదగిరిగుట్ట, పోచంపల్లిలో మిస్‌ వరల్డ్‌ బ్యూటీస్‌ సందడి (ఫొటోలు)

+5

బర్త్ డే పార్టీ ఫోటోలు షేర్ చేసిన యాంకర్ రష్మీ గౌతమ్ (ఫొటోలు)

+5

డ్యాన్సింగ్‌ క్వీన్‌ 'మాధురీ దీక్షిత్‌' బర్త్‌డే.. ఈ విషయాలు తెలుసా?

+5

నిఖిల్‌ సిద్ధార్థ్ పెళ్లికి ఐదేళ్లు.. భార్యకు స్పెషల్ విషెస్ (ఫొటోలు)

+5

తెలంగాణ : సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం (ఫొటోలు)

+5

అనంతపురంలో కుండపోత వర్షం.. వరద నీటిలో ప్రజల ఇక్కట్లు (ఫొటోలు)

+5

#MissWorld2025 : బతుకమ్మలతో ముద్దుగుమ్మలకు ఆత్మీయ స్వాగతం (ఫొటోలు)

+5

ఈ తీపి గుర్తులు మరిచిపోలేను‌.. ఫోటోలు విడుదల చేసిన శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

జాతరలో నిర్లక్ష్యం గంగమ్మ జాతరకు భారీగా భక్తులు..(ఫొటోలు)