Breaking News

మథియాస్‌ బో గుడ్‌బై

Published on Sun, 08/04/2024 - 04:30

పారిస్‌: భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ కోచ్‌ పదవి నుంచి మథియాస్‌ బో తప్పుకున్నాడు. సాత్విక్   సాయిరాజ్‌ –చిరాగ్‌ శెట్టి జోడీని గొప్పగా తీర్చిదిద్ది వారి విజయాల్లో కీలకపాత్ర పోషించిన అతను పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత ద్వయం వైఫల్యం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాడు. గత కొంత కాలంగా అద్భుత ప్రదర్శనతో వరుసగా ట్రోఫీలు నెగ్గి పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకంపై ఆశలు రేపిన సాతి్వక్‌–చిరాగ్‌ జంట క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించింది. 

2012 లండన్‌ ఒలింపిక్స్‌ డబుల్స్‌ విభాగంలో రజతం గెలిచిన మథియాస్‌ భారత జట్టుకు నాలుగేళ్ల క్రితం డబుల్స్‌ స్పెషలిస్ట్‌ కోచ్‌గా వచ్చాడు. ‘నా కోచింగ్‌ రోజులు ముగిశాయి. ఇకపై నేను భారత్‌లో గానీ, మరెక్కడా గానీ కోచింగ్‌ ఇవ్వబోవడం లేదు. చాలా సమయం బ్యాడ్మింటన్‌ కోర్టుల్లో తీవ్ర ఒత్తిడి మధ్య గడిపిన నేను బాగా అలసిపోయాను. నాకు అండగా నిలిచిన, ఎన్నో జ్ఞాపకాలు అందించిన అందరికీ కృతజ్ఞతలు’ అని మథియాస్‌ బో స్పష్టం చేశాడు. 

ప్రతికూల పరిస్థితుల్లోనూ కష్టపడి భారీ అంచనాలతో ఒలింపిక్స్‌ బరిలోకి దిగి పతకం సాధించలేకపోయిన సాత్విక్  –చిరాగ్‌ల ప్రదర్శన పట్ల గర్వపడుతున్నానని, భవిష్యత్తులో వారిద్దరు ఎన్నో విజయాలు సాధిస్తారని మథియాస్‌ ఆకాంక్షించాడు. డెన్మార్క్‌కు చెందిన 44 ఏళ్ల మథియాస్‌ ఈ ఏడాది మార్చిలోనే సినీ నటి తాప్సీని పెళ్లి చేసుకున్నాడు.  

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)