Breaking News

రెండు మ్యాచ్‌లూ ‘టై’

Published on Fri, 12/06/2024 - 04:06

పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 11వ సీజన్‌లో గురువారం జరిగిన రెండు మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. దబంగ్‌ ఢిల్లీ, యూపీ యోధాస్‌ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ 32–32 పాయింట్లతో... జైపూర్‌ పింక్‌ పాంథర్స్, యు ముంబా మధ్య జరిగిన రెండో మ్యాచ్‌ 22–22 పాయింట్లతో ‘టై’ అయ్యాయి. ఢిల్లీ తరఫున అశు మలిక్‌ 11 పాయింట్లు, నవీన్‌ 8 పాయింట్లతో రాణించారు. 

యోధాస్‌ తరఫున గగన్‌ గౌడ 13 పాయింట్లు, భవానీ రాజ్‌పుత్‌ 10 పాయింట్లు సాధించారు. మాŠయ్చ్‌ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా పోరాడాయి. రక్షణాత్మక ధోరణిలో ముందుకు సాగిన ఇరు జట్లు ఒక్కోసారి ఆలౌటయ్యాయి. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన మరో మ్యాచ్‌లో పింక్‌ పాంథర్స్, యు ముంబా జట్లు తుదికంటా పోరాడాయి. 

జైపూర్‌ తరఫున రెజా అత్యధికంగా 6 పాయింట్లు సాధించగా... యు ముంబా తరఫున సోమ్‌బీర్‌  7 పాయింట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు డిఫెన్స్‌లో దుమ్మురేపాయి. తాజా సీజన్‌లో ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లాడిన యు ముంబా 54 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. 

పింక్‌ పాంథర్స్‌ 49 పాయింట్లతోఆరో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్‌ తలైవాస్‌తో గుజరాత్‌ జెయింట్స్‌ (రాత్రి 8 గంటలకు), హరియాణా స్టీలర్స్‌తో పట్నా పైరేట్స్‌ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.  

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు