Breaking News

ఒకే జట్టులో 11 మందితో బౌలింగ్‌.. టీ20 క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి

Published on Fri, 11/29/2024 - 20:26

పురుషుల టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో కనివినీ ఎరుగని రికార్డు నమోదైంది. ఒకే ‍మ్యాచ్‌లో జట్టులోని మొత్తం 11 మంది బౌలింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ అరుదైన ఫీట్‌కు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 వేదికైంది.

ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం వాంఖడే స్టేడియంలో మణిపూర్‌తో జరిగిన జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టులోని మొత్తం 11 మంది బౌలింగ్ చేశారు. ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోని జట్టులో ప్రతీ ఒక్కరితో బౌలింగ్ చేయించాడు. ఆఖరికి వికెట్ కీపర్‌గా ఉన్న బదోని సైతం ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేశాడు. 

తద్వారా టీ20 క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో మొత్తం 11 మంది బౌలర్లను ఉపయోగించిన తొలి జట్టుగా ఢిల్లీ రికార్డులకెక్కింది. టీ20ల్లోఒకే ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు అత్యధికంగా 9 మంది మాత్రమే బౌలింగ్ చేశారు. ఐపీఎల్‌లో దక్కన్‌ ఛార్జర్స్‌, ఆర్సీబీ జట్లు తొమ్మిది మంది బౌలర్లను ఉపయోగించాయి. తాజా మ్యాచ్‌తో ఈ అల్‌టైమ్‌ రికార్డును ఢిల్లీ బ్రేక్‌ చేసింది.

కాగా ఢిల్లీ జట్టుకు సంబంధించి స్కోర్ కార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఢిల్లీ బౌలర్లు ఆయుష్ సింగ్, అఖిల్ చౌదరి, ఆయుష్ బదోని రెండేసి ఓవర్లు బౌలింగ్ చేయగా.. . హర్ష్ త్యాగీ, దిగ్వేష్, మయాంక్ రావత్ తలా మూడు ఓవర్లు బౌలింగ్ చేశారు. 

వీరితో పాటు ఆర్యన్ రానా, హిమ్మంత్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, యశ్ దుల్‌, రావత్ కూడా ఒక ఓవర్ బౌలింగ్ చేశారు. త్యాగీ, దిగ్వేష్ తలా రెండు వికెట్లు సాధించగా.. బదోని, అయూష్ సింగ్‌, ప్రియాన్షూ ఆర్య చెరో వికెట్ పడగొట్టారు.
చదవండి: Asia Cup 2024: రేపే భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్‌.. లైవ్ ఎక్క‌డో తెలుసా?

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)