Breaking News

DC vs CSK: విశాఖలో ఉర్రూతలే!

Published on Sun, 03/31/2024 - 07:40

విశాఖ స్పోర్ట్స్‌: క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) విశాఖ నగరానికి మళ్లీ వచ్చేసింది. వైఎస్సార్‌ స్టేడియంలో ఆదివారం రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్‌, చైన్నె సూపర్‌కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. విజయపరంపరను కొనసాగించేందుకు సీఎస్‌కే పట్టుదలగా ఉండగా హోమ్‌గ్రౌండ్‌లో విజయంతో శుభారంభం చేయడానికి డీసీ జట్టు ప్రణాళిక రచించింది. 2019 ఐపీఎల్‌ సీజన్‌ నాకవుట్‌లో క్వాలిఫైయిర్‌ మ్యాచ్‌ విశాఖ వేదికగా జరగ్గా ముఖాముఖీ పోరులో డీసీపై సీఎస్‌కే జట్టు విజయం సాధించిన విషయం విదితమే.

మళ్లీ ఇప్పుడు మ్యాచ్‌ జరగనుండడంతో మైదానంలో ప్రత్యక్షంగా మ్యాచ్‌ చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారు. శనివారం ఇరు జట్ల ప్లేయర్లు గ్రౌండ్‌లో సుదీర్ఘ సమయం సాధన చేశాయి. ఇక అభిమానులు అసలు పోరును ఆస్వాదించడమే తరువాయి. గంటలోనే మ్యాచ్‌ టికెట్లు అమ్ముడుపోగా శనివారం సైతం ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన టికెట్లను ఫిజికల్‌ టికెట్లగా స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా అభిమానులు రిడీమ్‌ చేసుకున్నారు.

స్టేడియంలో భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ
ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా సీఎస్‌కే జట్టు ఫ్రాంచైజీ అధినేతతో ఏసీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ కార్యదర్శి ఎస్‌ఆర్‌ గోపినాథ్‌రెడ్డి, నగర సీపీ రవిశంకర్‌ కాసేపు ముచ్చటించారు. మ్యాచ్‌ ఏర్పాట్లు, భద్రత చర్యల గురించి చర్చించారు.

నేడు ట్రాఫిక్‌ మళ్లింపు
విశాఖ సిటీ: ఐపీఎల్‌ మ్యాచ్‌కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం జరగనున్న మ్యాచ్‌కు 28 వేల మంది వీక్షకులు స్టేడియానికి వచ్చే అవకాశాలు ఉండడంతో అందుకు తగ్గట్టుగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఒకవైపు భద్రతా చర్యలతో పాటు మరోవైపు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వైపు ట్రాఫిక్‌ మళ్లింపు చేపడుతున్నారు. మ్యాచ్‌తో సంబంధం లేని వాహనదారులు మధురవాడ క్రికెట్‌ స్టేడియం వైపు ప్రయాణించకుండా వేరే మార్గాలలో ప్రయాణించాలని సూచించారు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)