Breaking News

IPL 2024: పంత్‌ రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పాంటింగ్‌

Published on Wed, 02/07/2024 - 16:49

ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ తమ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌కు (2024) పంత్‌ పూర్తిగా అందుబాటులో ఉండాలని కోరుకుంటూనే.. అతని రీఎంట్రీపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని బాంబు పేల్చాడు. రీఎంట్రీపై పంత్‌ను అడిగితే మాత్రం అన్ని మ్యాచ్‌లకు సై అంటాడని, వికెట్‌కీపింగ్‌ విషయంలోనూ తగ్గేదేలేదని అంటాడని, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతానని ధీమాగా చెబుతాడని అన్నాడు.

పంత్‌ ప్రస్తుత పరిస్థితి చూస్తే వచ్చే సీజన్‌లో అతను ఆడగలడని తెలుస్తుంది కాని అతను పూర్తి మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడా.. కెప్టెన్సీ, వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలను చేపట్టగలడా అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉందని తెలిపాడు. పంత్‌ రీఎంట్రీకి సంబంధించి ఎలాంటి విషయమైనా తమకు యాడెడ్‌ అడ్వాంటేజ్‌ అవుతుందని అన్నాడు. కారు ప్రమాదం​ తాలూకా గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న పంత్‌ రీఎంట్రీపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని తెలిపాడు.

ఒకవేళ పంత్‌ కెప్టెన్సీ చేపట్టలేని పక్షంలో డేవిడ్‌ వార్నర్‌ మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపడతాడని కన్ఫర్మ్‌ చేశాడు. ప్రస్తుత జట్టు విషయంలో సంతృప్తి వ్యక్తం చేశాడు. హ్యారీ బ్రూక్‌ తమలో చేరడం కలిసొస్తుందని అభిప్రాయపడ్డాడు. అతన్ని ఫినిషర్‌ పాత్రలో వాడుకుంటామని తెలిపాడు. వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌ టాపార్డర్‌లో ఉంటారని కన్ఫర్మ్‌ చేశాడు. అక్షర్‌, కుల్దీప్‌లతో స్పిన్‌ విభాగం పటిష్టంగా ఉందని ధీమా వ్యక్తం చేశాడు. నోర్జే, జై రిచర్డ్‌సన్‌ అందుబాటులోకి వస్తే తమకు తిరుగే ఉండదని తెలిపాడు. మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో వాషింగ్టన్‌ ఫ్రీడం కోచ్‌గా ఎంపికైన సందర్భంగా మాట్లాడుతూ పాంటింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

కాగా, 2022 చివరి రోజుల్లో ఢిల్లీ కెప్టెన్‌ పంత్‌ కారు ప్రమాదానికి గురై ఏడాదికి పైగా క్రికెట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. పంత్‌ ప్రస్తుతం గాయాల నుంచి పూర్తిగా కోలుకుని ప్రాక్టీస్‌ కూడా చేస్తున్నాడు. అయితే అతను వికెట్‌కీపింగ్‌ చేయగలడా లేదా అనే విషయం అనుమానాస్పదంగా ఉంది. మేజర్‌ యాక్సిడెంట్‌ కావడంతో పంత్‌ రెండు కాళ్లలకు తీవ్రగాయాలయ్యాయి. అతని కాళ్లలో రాడ్స్‌ వేసి సర్జరీ చేశారు. ఈ నేపథ్యంలో పంత్‌ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఏడాది ఐపీఎల్‌ మార్చి చివరి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)