Breaking News

స్మృతి చేజారిన సెంచరీ 

Published on Sun, 01/18/2026 - 05:39

నవీ ముంబై: మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు అజేయంగా దూసుకెళుతోంది. జోరు మీదున్న జట్టు వరుసగా నాలుగో విజయాన్ని సాధించింది. శనివారం జరిగిన పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిరీ్ణత 20 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (41 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగింది. 

10 పరుగులకే జట్టు 4 వికెట్లు కోల్పోయిన దశలో లూసీ హామిల్టన్‌ (19 బంతుల్లో 36; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), స్నేహ్‌ రాణా (22; 3 ఫోర్లు)లతో కలిసి క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. బెల్, సయాలీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 169 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్మృతి మంధాన (61 బంతుల్లో 96; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేసింది. త్రుటిలో సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్న ఆమె... జార్జియా వోల్‌ (42 బంతుల్లో 54 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి రెండో వికెట్‌కు 142 పరుగుల్ని జోడించింది.

స్కోరు వివరాలు 
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: షఫాలీ (సి) రావత్‌ (బి) బెల్‌ 62; లిజెల్లీ (బి) బెల్‌ 4; వోల్వార్ట్‌ (బి) బెల్‌ 0; జెమీమా (బి) సయాలీ 4; మరిజాన్‌ (బి) సయాలీ 0; నికీ (ఎల్బీ) (బి) రావత్‌ 12; మిన్ను మణి (సి) మంధాన (బి) డిక్లెర్క్‌ 5; స్నేహ్‌ రాణా (బి) రావత్‌ 22; హామిల్టన్‌ (సి) రాధ (బి) సయాలీ 36; శ్రీచరణి నాటౌట్‌ 11; నందిని రనౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్‌) 166. 
వికెట్ల పతనం: 1–5, 2–5, 3–10, 4–10, 5–69, 6–74, 7–108, 8–130, 9–164, 10–166. 
బౌలింగ్‌: బెల్‌ 4–0–26–3, సయాలీ 3–0–27–3, శ్రేయాంక 3–0–44–0, డిక్లెర్క్‌ 4–0–31–1, ప్రేమ రావత్‌ 3–0–16–2, రాధా యాదవ్‌ 3–0–21–0. 

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: గ్రేస్‌ హారిస్‌ (సి) షఫాలీ (బి) మరిజాన్‌ 1; స్మృతి (సి) హామిల్టన్‌ (బి) నందిని 96;  జార్జియా వోల్‌ నాటౌట్‌ 54; రిచా ఘోష్‌ నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (18.2 ఓవర్లలో 2 వికెట్లకు) 169. 
వికెట్ల పతనం: 1–14, 2–156. 
బౌలింగ్‌: మరిజాన్‌ కాప్‌ 4–0–21–1, లూసీ హామిల్టన్‌ 3.2–0–37–0, నందిని శర్మ 4–0–34–1, శ్రీచరణి 3–0–26–0, స్నేహ్‌ రాణా 1–0–13–0, షఫాలీ 1–0–14–0, మిన్ను మణి 2–0–20–0.  
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)