Breaking News

ఢిల్లీ మళ్లీ...

Published on Wed, 04/23/2025 - 02:40

దాదాపు నెల రోజుల క్రితం... వైజాగ్‌లో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ వికెట్‌ తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను ఓడించింది... ఇప్పుడు ప్రత్యర్థి వేదికపై  సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ మళ్లీ ఆధిక్యం ప్రదర్శిస్తూ లక్నోపై ఏకపక్ష విజయాన్ని అందుకుంది. క్యాపిటల్స్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు సూపర్‌ జెయింట్స్‌ తక్కువ స్కోరుకే పరిమితం కాగా, ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందీ లేకుండా క్యాపిటల్స్‌ అలవోకగా మరో 13 బంతుల ముందే విజయాన్ని అందుకుంది. 

ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో ఆడని రాహుల్‌... ఈసారి హాఫ్‌ సెంచరీతో ఇన్నింగ్స్‌కు ఇరుసుగా నిలిచాడు. తనను గత ఏడాది అవమానించిన పాత జట్టు లక్నో వేదికపై సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించి సంతృప్తిగా నిలబడ్డాడు.   

లక్నో: తొలి ఐపీఎల్‌ టైటిల్‌ వేటలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో కీలక విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో ఢిల్లీ 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మార్క్‌రమ్‌ (33 బంతుల్లో 52; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... మిచెల్‌ మార్ష్(36 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ఆయుష్‌ బదోని (21 బంతుల్లో 36; 6 ఫోర్లు) రాణించారు. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ముకేశ్‌ కుమార్‌ (4/33) లక్నోను పడగొట్టాడు. అనంతరం ఢిల్లీ 17.5 ఓవర్లలో 2 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. కేఎల్‌ రాహుల్‌ (42 బంతుల్లో 57 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), అభిషేక్‌ పొరేల్‌ (36 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు సాధించగా... కెప్టెన్   అక్షర్‌ పటేల్‌ (20 బంతుల్లో 34 నాటౌట్‌; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.   

ఓపెనర్ల శుభారంభం... 
తొలి వికెట్‌కు 59 బంతుల్లో 87 పరుగులు భాగస్వామ్యం... ఈ సమయంలో లక్నో స్థితి చూస్తే భారీ స్కోరు ఖాయమనిపించింది. అయితే ఓపెనర్లు మార్క్‌రమ్, మార్ష్ఇచ్చిన ఈ ఘనారంభాన్ని ఆ తర్వాత జట్టు వృథా చేసుకుంది. పవర్‌ప్లేలో కొన్ని చక్కటి షాట్లు ఆడిన ఓపెనర్లు 6 ఓవర్లు ముగిసేసరికి 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో స్కోరును 51 పరుగులకు చేర్చారు. ఆ తర్వాత చమీరా ఈ భాగస్వామ్యాన్ని విడదీయగా, స్టార్క్‌ చక్కటి బంతితో పూరన్‌ (9)ను బౌల్డ్‌ చేశాడు. 

అనంతరం ముకేశ్‌ ఒకే ఓవర్లో సమద్‌ (2), మార్ష్ లను అవుట్‌ చేయడంతో లక్నో కష్టాలు పెరిగాయి. 11 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయాక పరుగులు రావడం కూడా కష్టంగా మారిపోయింది. అయితే ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా వచ్చిన బదోని కాస్త ప్రభావం చూపించాడు. ముకేశ్‌ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను తర్వాతి బంతికి బౌల్డయ్యాడు. 

వరుసగా వికెట్లు పడుతున్నా... సమద్, మిల్లర్‌ (14 నాటౌట్‌), బదోని తర్వాత ఇన్నింగ్స్‌లో మరో రెండు బంతులు ఉండగా ఏడో స్థానంలో రిషభ్‌ పంత్‌ (0) బ్యాటింగ్‌కు రావడం ఆశ్చర్యం కలిగించింది. టాస్‌ సమయంలో కుడి చేతికి కట్టుతో కనిపించిన పంత్‌ సమస్యేమీ లేదని చెప్పాడు. 

కీలక భాగస్వామ్యం... 
శార్దుల్‌ వేసిన తొలి ఓవర్లో 3 ఫోర్లతో 15 పరుగులు రాబట్టడంతో ఢిల్లీ ఛేదన మొదలైంది. కరుణ్‌ నాయర్‌ (15) తొందరగానే అవుటైనా... పొరేల్, రాహుల్‌ కలిసి చక్కటి సమన్వయంతో ఇన్నింగ్స్‌ను నడిపించడంతో పవర్‌ప్లేలో జట్టు 54 పరుగులు సాధించింది. రవి బిష్ణోయ్‌ ఓవర్లో 2 సిక్స్‌లతో 16 పరుగులు రాబట్టి ఢిల్లీ ధాటిని పెంచింది.

33 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత పొరేల్‌ వెనుదిరిగాడు. పొరేల్, రాహుల్‌ రెండో వికెట్‌కు 49 బంతుల్లో 69 పరుగులు జత చేశారు. అయితే ఆ తర్వాత రాహుల్, అక్షర్‌ కలిసి సునాయాసంగా జట్టును గెలుపు దిశగా నడిపించారు. రాహుల్, అక్షర్‌ మూడో వికెట్‌కు 36 బంతుల్లో అభేద్యంగా 56 పరుగులు జోడించారు.  

స్కోరు వివరాలు  
లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (సి) స్టబ్స్‌ (బి) చమీరా 52; మార్ష్(బి) ముకేశ్‌ 45; పూరన్‌ (బి) స్టార్క్‌ 9; సమద్‌ (సి) అండ్‌ (బి) ముకేశ్‌ 2; మిల్లర్‌ (నాటౌట్‌) 14; బదోని (బి) ముకేశ్‌ 36; పంత్‌ (బి) ముకేశ్‌ 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–87, 2–99, 3–107, 4–110, 5–159, 6–159. బౌలింగ్‌: అక్షర్‌ 4–0–29–0, స్టార్క్‌ 4–0–25–1, ముకేశ్‌ 4–0–33–4, చమీరా 3–0–25–1, విప్‌రాజ్‌ 1–0–14–0, కుల్దీప్‌ 4–0–33–0. 

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పొరేల్‌ (సి) మిల్లర్‌ (బి) మార్క్‌రమ్‌ 51; కరుణ్‌ నాయర్‌ (బి) మార్క్‌రమ్‌ 15; రాహుల్‌ (నాటౌట్‌) 57; అక్షర్‌ (నాటౌట్‌) 34; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.5 ఓవర్లలో 2 వికెట్లకు) 161.  వికెట్ల పతనం: 1–36, 2–105. బౌలింగ్‌: శార్దుల్‌ ఠాకూర్‌ 2–0–28–0, దిగ్వేశ్‌ రాఠీ 4–0–24–0, ప్రిన్స్‌ 2.5–0–23–0, మార్క్‌రమ్‌ 3–0–30–2, అవేశ్‌ ఖాన్‌ 3–0–19–0, రవి బిష్ణోయ్‌ 3–0–36–0.  

ఐపీఎల్‌లో నేడు
హైదరాబాద్‌ xముంబై  
వేదిక: హైదరాబాద్‌
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)