Breaking News

అబుదాబీ టీ10 లీగ్‌ విజేత డెక్కన్‌ గ్లాడియేటర్స్‌

Published on Tue, 12/03/2024 - 14:49

అబుదాబీ టీ10 లీగ్‌ 2024 ఎడిషన్‌ విజేతగా డెక్కన్‌ గ్లాడియేటర్స్‌ అవతరించింది. మోరిస్‌విల్లే సాంప్‌ ఆర్మీతో నిన్న (డిసెంబర్‌ 2) జరిగిన ఫైనల్లో గ్లాడియేటర్స్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సాంప్‌ ఆర్మీ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. 

ఫాఫ్‌ డుప్లెసిస్‌ (23 బంతుల్లో 34; 5 ఫోర్లు, సిక్స్‌), వికెట్‌కీపర్‌ ఆండ్రియస్‌ గౌస్‌ (9 బంతుల్లో 21; ఫోర్‌, 2 సిక్సర్లు) ఓ మోస్తరు పరుగులు చేశారు. షర్జీల్‌ ఖాన్‌ 5, అసలంక 13, జాక్‌ టేలర్‌ 1, కరీమ్‌ జనత్‌ 16 (నాటౌట్‌), రోహన్‌ ముస్తఫా 0, ఇమాద్‌ వసీం 7, ఖైస్‌ అహ్మద్‌ 1 (నాటౌట్‌) పరుగు చేశారు. గ్లాడియేటర్స్‌ బౌలర్లలో రిచర్డ్‌ గ్లీసన్‌ 2, తీక్షణ, నోర్జే, ఉస్మాన్‌ తారిక్‌, ఇబ్రార్‌ అహ్మద్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

105 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గ్లాడియేర్స్‌.. టామ్‌ కొహ్లెర్‌ కాడ్‌మోర్‌ (21 బంతుల్లో 56 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), నికోలస్‌ పూరన్‌ (10 బంతుల్లో 28; ఫోర్‌, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో 6.5 ఓవర్లలోనే 2 వికెట్ల కోల్పోయి గమ్యాన్ని చేరుకుంది. 

ఆఖర్లో రిలీ రొస్సో (5 బంతుల్లో 12; 3 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. జోస్‌ బట్లర్‌ (5 బంతుల్లో 12 నాటౌట్‌; సిక్స్‌) సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. అబుదాబీ టీ10 లీగ్‌లో డెక్కన్‌ గ్లాడియేటర్స్‌కు ఇది మూడో టైటిల్‌. 2021-22, 2022 ఎడిషన్లలో కూడా గ్లాడియేటర్స్‌ ఛాంపియన్‌గా నిలిచింది. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)