Breaking News

వరుస మెరుపు ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోతున్న రాబిన్‌ ఉతప్ప

Published on Mon, 01/16/2023 - 21:35

ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20, 2023 (దుబాయ్‌) సీజన్‌లో టీమిండియా మాజీ క్రికెటర్‌, దుబాయ్‌ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ రాబిన్‌ ఉతప్ప వరుస మెరుపు ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోతున్నాడు. అబుదాబీ నైట్‌రైడర్స్‌తో జరిగిన సీజన్‌ తొలి మ్యాచ్‌లో 33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసిన రాబీ.. ఇవాళ (జనవరి 16) గల్ఫ్‌ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 46 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఏకంగా 79 పరుగులు చేశాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహిస్తున్న దుబాయ్‌ క్యాపిటల్స్‌ టీమ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

దుబాయ్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ రోవమన్‌ పావెల్‌ (25 బంతుల్లో 38; ఫోర్‌, 3 సిక్సర్లు), సికందర్‌ రజా (19 బంతుల్లో 30 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించగా.. జో రూట్‌ (6), భానుక రాజపక్స (3), దసున్‌ షనక (2), రవి బొపారా (2), ఇసురు ఉడాన (2) నిరాశపరిచారు. ఆఖర్లో హజ్రత్‌ లుక్మాన్‌ (3 బంతుల్లో 10) వరుస బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌ బాదడంతో క్యాపిటల్స్‌ జట్టు 180 పరుగుల మార్కును దాటింది. గల్ప్‌ జెయింట్స్‌ బౌలర్లలో రెహాన్‌ అహ్మద్‌ 3 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్‌ గ్లీసన్‌ 2, సంచిత్‌ శర్మ, డేవిడ్‌ వీస్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

కాగా, ఈ సీజన్‌లో రాబిన్‌ ఉతప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న దుబాయ్‌ క్యాపిటల్స్‌ టీమ్‌ అద్భుతమ ప్రదర్శనతో ముందుకెళ్తుంది. తొలి మ్యాచ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్‌ను 73 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించిన ఈ జట్టు.. తాజాగా గల్ఫ్‌ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ భారీ స్కోర్‌ సాధించి, మరో విజయానికి బాటలు వేసుకుంది.      

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)