Breaking News

నన్ను భయపెట్టిన బౌలర్‌ అతడే.. చాలా డేంజరస్‌: డేవిడ్‌ వార్నర్‌

Published on Tue, 01/02/2024 - 10:57

ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తన చివరి టెస్టు మ్యాచ్‌ ఆడేందుకు సిద్దమయ్యాడు. జనవరి 3 నుంచి పాకిస్తాన్‌తో జరగనున్న మూడో టెస్టు అనంతరం సంప్రదాయక్రికెట్‌కు డేవిడ్‌ భాయ్‌ విడ్కోలు పలకనున్నాడు. టెస్టులతో పాటు వన్డేలకు వార్నర్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అతడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది.

అయితే తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నర్‌కు తన టెస్టు కెరీర్‌లో ఎదు అత్యంత కఠినమైన బౌలర్ ఎవరన్న ప్రశ్న ఎదురైంది. అందుకు బదలుగా వార్నర్‌ ఏమి ఆలోచించకుండా దక్షిణాఫ్రికా లెజెండ్‌ డేల్‌ స్టేయిన్‌ పేరును చెప్పుకొచ్చాడు.

'నా టెస్టు కెరీర్‌లో నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్‌ డేల్‌ స్టేయిన్‌. 2016-2017లో గబ్బా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు ఇప్పటికి నాకు గుర్తుంది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్‌ సెషన్‌లో డేల్‌ స్టేయిన్‌ నిప్పలు చేరిగాడు. బౌన్సర్లతో నన్ను షాన్‌ మార్ష్‌ను భయపెట్టాడు.  45 నిమిషాల సెషన్‌ అయితే మాకు చుక్కలు చూపించింది. షాన్‌ నా దగ్గరకు వచ్చి అతడి బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొవాలో నాకు అర్ధ కావడం లేదని చెప్పాడు.

కనీసం పుల్‌ షాట్‌ ఆడాదామన్న కూడా అవకాశం లేదు. చాలా ఓవర్ల పాటు కనీసం బంతిని కూడా టచ్‌ చేయలేకపోయాను. ఓ బంతి ఏకంగా నా భుజానికి వచ్చి తాకింది. నొప్పితో విల్లాలాడాను. స్టేయిన్‌ ఎడమచేతి వాటం బ్యాటర్లకు అద్బుతంగా బౌలింగ్‌ చేస్తాడు. అతడు బౌలింగ్‌ చేస్తే ప్రతీ బ్యాటర్‌కు కొంచెం భయం కచ్చితంగా ఉంటుందని' వార్నర్‌ పేర్కొన్నాడు. కాగా వరల్డ్‌ క్రికెట్‌ చరిత్రలో స్పీడ్‌గన్‌ స్టేయిన్‌ తన పేరును సువర్ణఅక్షరాలతో లిఖించుకున్నాడు. దక్షిణాఫ్రికా తరపున టెస్టులలో 439 వికెట్లు, వన్డేలలో 196 వికెట్లు, టీ20లలో 64 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్‌ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్‌ దిగ్గజ బౌలర్‌

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు