Breaking News

డేవిడ్ వార్నర్‌పై నిషేధం ఎత్తివేత

Published on Fri, 10/25/2024 - 10:16

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌పై ఉన్న జీవితకాల కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేశారు. 2018లో సాండ్‌ పేపర్‌ వివాదంలో (కేప్‌టౌన్‌ టెస్ట్‌లో) వార్నర్‌పై జీవితకాల కెప్టెన్సీ నిషేధం విధించబడింది. తాజాగా క్రికెట్‌ ఆస్ట్రేలియా వార్నర్‌పై కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. సాండ్ పేపర్ వివాదంలో వార్నర్ ఏడాది పాటు ఆటకు కూడా దూరయ్యాడు. 

క్రికెట్‌ ఆస్ట్రేలియా తాజా నిర్ణయంతో వార్నర్‌ బిగ్‌బాష్‌ లీగ్‌లో సిడ్నీ థండర్స్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది. నిషేధం కారణంగా వార్నర్‌ ఆస్ట్రేలియా కెప్టెన్‌గా పని చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 37 ఏళ్ల వార్నర్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే జట్టుకు అవసరమైతే భారత్‌తో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తిరిగి బరిలోకి దిగుతానని ప్రకటించాడు.

వార్నర్‌ ఆసీస్‌ తరఫున 112 టెస్ట్‌లు ఆడి 8786 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 37 అర్ద సెంచరీలు ఉన్నాయి. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ నవంబర్‌ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్‌, ఆస్ట్రేలియా జట్లు ఐదు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడనున్నాయి. 
 

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)