Breaking News

కెరీర్‌లో చివరి మ్యాచ్‌.. కన్నీరు పెట్టుకున్న డేవిడ్‌ వార్నర్‌! వీడియో వైరల్‌

Published on Sat, 01/06/2024 - 12:06

ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తన 13 ఏళ్ల సుదీర్ఘ టెస్టు కెరీర్‌కు ముగింపు పలికాడు. సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టు అనంతరం టెస్టు క్రికెట్‌ నుంచి వార్నర్‌ తప్పుకున్నాడు. తన ఫేర్‌వెల్‌ సిరీస్‌ తొలి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన వార్నర్‌.. తన కెరీర్‌ చివరి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.

మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో (75 బంతుల్లో 7 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీ సాధించాడు. ఆసీస్‌ విజయానికి చేరువైన సమయంలో పాక్‌ స్పిన్నర్‌  సాజిద్ ఖాన్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ ఎల్బీగా వెనుదిరాడు. మైదానాన్ని వీడి వెళ్తున్న క్రమంలో పాకిస్తాన్‌ ఆటగాళ్లు వార్నర్‌ను అభినందించారు. అదే విధంగా స్టేడియంలోని ప్రేక్షకులు సైతం స్టాండింగ్‌ ఓవేషన్‌ ఇచ్చారు. ఇక మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన వార్నర్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వార్నర్‌ కన్నీరు పెట్టుకున్నాడు. 

"విజయంతో నా కెరీర్‌ను ముగించాలనుకున్నాను. నా కల నిజమైంది. మేము 3-0తో విజయం సాధించాము. ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు గత 2 ఏళ్ల నుంచి అద్బుతమైన క్రికెట్‌ ఆడుతోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజయం, యాషెస్ సిరీస్ డ్రా,  ప్రపంచ కప్ విజయాల్లో భాగమైనందుకు గర్వపడుతున్నాను.

కొంత మంది లెజెండరీ క్రికెటర్లతో కలిసి ఆస్ట్రేలియా జట్టు తరపున ఆడే అవకాశం దక్కినందుకు అదృష్టంగా భావిస్తున్నానని"వార్నర్‌ పేర్కొన్నాడు. తన టెస్టు కెరీర్‌లో 111 మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌.. 44. 59 సగటుతో 8695 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 26 సెంచరీలు, 3 డబుల్‌ సెంచరీలు, 56 అర్ధ శతకాలు ఉన్నాయి.
చదవండి: Ranji Trophy: చరిత్ర సృష్టించిన రాహుల్‌.. ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ! రెండో ఆటగాడిగా

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)