Breaking News

డేవిడ్ వార్నర్ విధ్వంసం.. కోహ్లి రికార్డు సమం

Published on Sun, 01/04/2026 - 13:32

బిగ్ బాష్ లీగ్ 2025-26 సీజన్‌లో సిడ్నీ థండర్ కెప్టెన్‌, ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎట్టకేలకు తన విశ్వరూపం చూపించాడు. ఈ లీగ్‌లో భాగంగా శనివారం సిడ్నీ వేదికగా హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ థండర్‌కు మొదటి ఓవర్‌లోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 

తొలి రెండు బంతుల్లోనే ఇన్ ఫామ్ మాథ్యూ గిల్క్స్, సామ్ కాన్‌స్టాస్ వికెట్లను సిడ్నీ కోల్పోయింది. ఈ సమయంలో వార్నర్ ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి వార్నర్ మాత్రం తన విధ్వంసాన్ని ఆపలేదు. ముఖ్యంగా హరికేన్స్ స్పీడ్ స్టార్ నాథన్ ఎల్లిస్‌ను వార్నర్ ఉతికారేశాడు.

ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో వార్నర్ 3 సిక్సర్లు, 2 ఫోర్లతో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు.  ఈ క్రమంలో కేవలం 56 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. దీంతో తన 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ(బీబీఎల్ సెంచరీ)కు డేవిడ్ భాయ్ తెరదించాడు. 

మొత్తంగా 65 బంతులు ఎదుర్కొన్న వార్నర్ 11 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో 130 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా సిడ్నీ థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం ఈ భారీ లక్ష్యాన్నిహోబర్ట్ హరికేన్స్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. దీంతో సిడ్నీ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

కోహ్లి రికార్డు సమం..
అయితే ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన వార్నర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. కోహ్లి ఇప్పటివరకు టీ20ల్లో 9 సెంచరీలు చేయగా.. వార్నర్ కూడా సరిగ్గా తొమ్మిది సతకాలు నమోదు చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్‌(22) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానంలో పాక్ స్టార్ బాబర్ ఆజం ఉన్నాడు.
చదవండి: మహ్మద్ షమీ కెరీర్ ముగిసిన‌ట్లేనా..?

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)