Breaking News

అర్ధ శతకాల్లో సెంచరీ! వార్నర్‌ రికార్డు!

Published on Sat, 02/10/2024 - 09:18

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్‌ వార్నర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తన వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో వార్నర్‌.. కరేబియన్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో వార్నర్ కేవలం 22 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 36 బంతులు ఎదుర్కొన్న డేవిడ్‌ భాయ్‌ 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో 70 పరుగులు చేశాడు.

కాగా వార్నర్‌కు ఇది టీ20ల్లో 100వ హాఫ్‌ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ఓ అరుదైన ఘనతను వార్నర్‌ తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్‌లో వంద అర్ధశతకాల మార్క్‌ను అందుకున్న తొలి క్రికెటర్‌గా వార్నర్‌ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఓవరాల్‌గా 367 టీ20లు ఆడిన వార్నర్‌ 100 హాఫ్‌ సెంచరీలను సాధించాడు.

ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో వార్నర్‌ తర్వాతి స్ధానంలో విరాట్‌ కోహ్లి(91) ఉన్నాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో వార్నర్‌ మరో అరుదైన రికార్డును నమోదు చేశాడు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆస్ట్రేలియా క్రికెటర్‌గా వార్నర్‌ రికార్డులకెక్కాడు. అయితే ఓవరాల్‌గా ఈ రికార్డు సాధించిన మూడో ప్లేయర్‌గా వార్నర్ నిలిచాడు. ఈ జాబితాలో డేవిడ్‌ కంటే ముందు భారత  స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్‌ రాస్ టేలర్ ఉన్నాడు.
చదవండి: 'ప్లీజ్‌.. నా కొడుకును జడేజాతో పోల్చవద్దు'

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)