Breaking News

David Warner: అత్యంత వేగంగా.. కోహ్లి, ధావన్‌ల రికార్డు బద్దలు

Published on Sat, 04/08/2023 - 18:46

ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఐపీఎల్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వార్నర్‌ ఐపీఎల్‌లో 6వేల పరుగులు మార్క్‌ను అందుకున్నాడు. 165 ఇన్నింగ్స్‌లోనే వార్నర్‌ ఈ ఫీట్‌ను సాధించడం విశేషం.

ఈ నేపథ్యంలోనే కోహ్లి, ధావన్‌ల రికార్డును బద్దలు కొట్టి ఐపీఎల్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఆరువేల పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇదే ఆరువేల పరుగుల మార్క్‌ అందుకోవడానికి కోహ్లి 188 ఇన్నింగ్స్‌లు తీసుకుంటే.. శిఖర్‌ ధావన్‌ 199 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. కానీ వార్నర్‌కు మాత్రం 165 ఇన్నింగ్స్‌లు మాత్రమే అవసరమయ్యాయి.

ఇక ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో వార్నర్‌ ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో కోహ్లి 6727 పరుగులు(225 మ్యాచ్‌లు), శిఖర్‌ ధావన్‌ 6370 పరుగులు(208 మ్యాచ్‌లు) రెండో స్థానంలో నిలిచాడు.

ఇక ఐపీఎల్‌లో 4వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్లలో వార్నర్‌ బ్యాటింగ్‌ యావరేజ్‌ ది బెస్ట్‌ అని చెప్పొచ్చు. వార్నర్‌ సగటు 42.28 కాగా.. స్ట్రైక్‌ రేట్‌ 140.08గా ఉంది. ఇక స్ట్రైక్‌రేట్‌ విషయంలో ఏబీ డివిలియర్స్‌(151.68), క్రిస్‌ గేల్‌(148.96) తర్వాత వార్నర్‌కు మాత్రమే 140 స్ట్రైక్‌రేట్‌ కలిగి ఉన్నాడు.

చదవండి: సంజూ స్టన్నింగ్‌ క్యాచ్‌.. పృథ్వీ షా చెత్త రికార్డు

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)