Breaking News

AUS VS WI 1st T20: వార్నర్‌ 'ట్రిపుల్‌ ‘సెంచరీ’

Published on Fri, 02/09/2024 - 15:03

ఆస్ట్రేలియా వెటరన్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో 100కు పైగా మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా, తొలి ఆస్ట్రేలియా ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు.

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హోబర్ట్‌ వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ (ఫిబ్రవరి 9) జరుగుతున్న తొలి మ్యాచ్‌ వార్నర్‌ టీ20 కెరీర్‌లో 100వది. ఇటీవలే వన్డే, టెస్ట్‌ ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన 37 ఏళ్ల వార్నర్‌ ఇప్పటివరకు 112 టెస్ట్‌లు, 161 వన్డేలు, 100 టీ20లు ఆడాడు. 

వార్నర్‌కు ముందు ఈ ఘనత న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు రాస్‌ టేలర్‌, టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి మాత్రమే సాధించారు. రాస్‌ టేలర్‌ 112 టెస్ట్‌లు, 236 వన్డేలు, 102 టీ20లు ఆడగా.. కోహ్లి 113 టెస్ట్‌లు, 292 వన్డేలు, 117 టీ20లు ఆడాడు. 

ఇదిలా ఉంటే, వార్నర్‌ తన 100వ టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి  ఆసీస్‌ భారీ స్కోర్‌ సాధించేందకు గట్టి పునాది వేశాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన వార్నర్‌.. మొత్తంగా 36 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 70 పరుగులు చేసి అల్జరీ జోసఫ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

వార్నర్‌ ఔటయ్యాక ఆసీస్‌ వరసగా వికెట్లు కోల్పోవడంతో స్కోర్‌ వేగం మందగించింది. 17 ఓవర్ల తర్వత ఆ జట్టు స్కోర్‌ 173/5గా ఉంది. వార్నర్‌, జోష్‌ ఇంగ్లిస్‌ (39), మిచెల్‌ మార్ష్‌ (16), మ్యాక్స్‌వెల్‌ 10), స్టోయినిస్‌ (9) ఔట్‌ కాగా.. టిమ్‌ డేవిడ్‌ (18), మాథ్యూ వేడ్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్‌ బౌలరల్లో అల్జరీ జోసఫ్‌ 2, జేసన్‌ హోల్డర్‌, ఆండ్రీ రసెల్‌, రొమారియో షెపర్డ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

ఇదిలా ఉంటే, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ల కోసం వెస్టిండీస్‌ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. టెస్ట్‌ సిరీస్‌ 1-1తో సమం కాగా.. వన్డే సిరీస్‌ను ఆసీస్‌ క్లీన్‌స్వీప్‌ (3-0) చేసింది. రెండు, మూడు టీ20లు ఫిబ్రవరి 11, 13 తేదీల్లో అడిలైడ్‌, పెర్త్‌ వేదికలుగా జరుగనున్నాయి
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)