Breaking News

కొత్త సంవత్సరం వేళ.. డేవిడ్‌ వార్నర్‌ సంచలన నిర్ణయం

Published on Mon, 01/01/2024 - 07:25

ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సం‍చలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే తన కెరీర్‌లో చివరి టెస్టు ఆడేందుకు సిద్దమైన వార్నర్‌.. తాజాగా వన్డే క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. సోమవారం తన నిర్ణయాన్ని డేవిడ్‌ భాయ్‌ వెల్లడించాడు. అయితే జట్టుకు తన అవసరం ఉందని క్రికెట్‌ ఆస్ట్రేలియా భావిస్తే పాకిస్తాన్‌ వేదికగా జరగనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025కి ఆడేందుకు అందుబాటులో ఉంటానని తెలిపాడు. 

"టెస్టులతో పాటు వన్డే క్రికెట్‌ నుంచి కూడా రిటైర్‌ అవ్వాలని నిర్ణయించుకున్నాను. భారత్‌పై వన్డే ప్రపంచకప్‌ గెలిచిన ఈ తరుణమే ఆటకు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నాను. ఇది నా కెరీర్‌లో సాధించిన భారీ విజయం. టెస్టు, వన్డే ఫార్మాట్‌ల నుంచి  తప్పుకోవడం వల్ల ఫ్రాంఛైజీ లీగ్‌లలో ఆడేందుకు ఎక్కువ సమయం లభిస్తోంది. నేను తీసుకున్న ఈ నిర్ణయం కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తోంది.

అయితే త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ ఉందన్న విషయం నాకు తెలుసు. గత రెండేళ్లలో నేను మంచి క్రికెట్ ఆడుతున్నాను. రిటైర్మెంట్‌ ప్రకటించినప్పటికీ నేను ఫిట్‌నెస్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం  జట్టుకు అవసరమైతే కచ్చితంగా నేను అందుబాటులో ఉంటానని సిడ్నీ గ్రౌండ్‌లో విలేకరుల సమావేశంలో వార్నర్‌ పేర్కొన్నాడు.

కాగా వన్డే ప్రపంచకప్‌-2023ను ఆస్ట్రేలియా సొంతం చేసుకోవడంలో డేవిడ్‌ వార్నర్‌ది కీలక పాత్ర. ఈ టోర్నీలో  528 పరుగులు చేసిన డేవిడ్‌ భాయ్‌.. ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా తన వన్డే కెరీర్‌లో 161 మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌.. 22 సెంచరీలు, 33 హాఫ్‌ సెంచరీలతో  6932 పరుగులు చేశాడు. వన్డేల్లో ఆసీస్‌ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా వార్నర్‌ కొనసాగుతున్నాడు.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)