Breaking News

చరిత్ర సృష్టించిన డేవిడ్‌ మిల్లర్‌.. తొలి సౌతాఫ్రికా క్రికెటర్‌గా

Published on Thu, 02/08/2024 - 11:41

దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు డేవిడ్‌ మిల్లర్‌ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో 10 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి సౌతాఫ్రికా క్రికెటర్‌గా మిల్లర్‌ రికార్డులకెక్కాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2024లో భాగంగా బుధవారం జో బర్గ్‌ సూపర్‌ కింగ్స్‌తో జరిగిన ఎలిమేనిటర్‌ మ్యాచ్‌లో28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మిల్లర్‌.. ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ లీగ్‌లో పార్ల్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా మిల్లర్‌ వ్యవహరిస్తున్నాడు.

ఇప్పటివరకు 466 టీ20 మ్యాచ్‌లు ఆడిన మిల్లర్‌ 10019 పరుగులు చేశాడు. ​కాగా ఈ మైలు రాయిని సౌతాఫ్రికా దిగ్గజాలు ఏబీ డివిలియర్స్‌, ఫాప్‌ డుప్లెసిస్‌ కూడా అందుకోలేకపోయారు.  ఇక ఓవరాల్‌గా ఈ అరుదైన మైలు రాయిని అందుకున్న జాబితాలో మిల్లర్‌ 12 స్ధానంలో  నిలిచాడు. వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌(14562) తొలి స్ధానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. జో బర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ చేతిలో 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైన పార్ల్‌ రాయల్స్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

10 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న ఆటగాళ్లు వీరే?
క్రిస్‌ గేల్‌ (14562)
షోయబ్ మాలిక్ (13077)
కీరన్ పొలార్డ్ (12577),
అలెక్స్ హేల్స్ (12002),
విరాట్ కోహ్లి (11994),
డేవిడ్ వార్నర్ (11860),
ఆరోన్ ఫించ్ (11458),
రోహిత్ శర్మ (11156),
జోస్ బట్లర్ 11146),
కోలిన్ మున్రో (10602)
జేమ్స్ విన్స్ (10019)
డేవిడ్‌ మిల్లర్‌(10019)

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)