Breaking News

Asmita Dey: సైకిల్ మెకానిక్ కూతురి నుంచి.. బంగారు పతకం వరకు

Published on Sat, 08/01/2026 - 09:51

ఒక వైపు కటిక పేదరికం.. మరోవైపు దేశం గర్వించదగ్గ అథ్లెట్‌గా ఎదగాలన్న కల. ఈ కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం ఆమె పట్టుదలను సడలించలేకపోయాయి. ఆ కష్టాలనే సాధనాలుగా మార్చుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. సైకిల్ మెకానిక్ కూతురిగా సాధారణ కుటుంబంలో జన్మించిన ఆ అమ్మాయి.. ఈ రోజు ప్రతిష్టాత్మక కామన్‌మెల్త్ గేమ్స్‌లో భార‌త జెండాను రెపరెపలాడించింది. ఆమే 23 ఏళ్ల జూడో సంచలనం అస్మితా డే.

గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో అస్మితా బంగారు పతకంతో మెరిసింది. జూడో మహిళల 48 కేజీల విభాగంలో ఆమె ఈ గోల్డ్‌మెడల్ కైవసం చేసుకుంది. దీంతో మహిళల విభాగంలో భారత్‌కు తొలి కామన్వెల్త్‌ స్వర్ణం అందించిన జూడోకాగా అస్మిత చరిత్ర పుటలకెక్కింది.

ఉత్కంఠ పోరులో విజయం
కెనడాకు చెందిన హెయిడీ క్వాచ్‌తో జరిగిన ఈ ఫైనల్ పోరు అభిమానులను ఆఖరి వరకు మునివేళ్లపై నిలబెట్టింది. మ్యాచ్ ప్రారంభంలోనే అస్మిత 'యుకో' పాయింట్‌తో పాటు ఒక పెనాల్టీని ఎదుర్కొని వెనుకబడింది. ఆ తర్వాత అస్మిత అద్భుతమైన పునరాగమనం ఇచ్చింది.

అస్మిత ఏ మాత్రం ఒత్తిడికి గురికాకుండా ప్రత్యర్ధికి గట్టిగా బదులిచ్చింది. దీంతో ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి స్కోర్‌ను 1-1తో సమం చేసింది. అనంతరం నిర్ణీత  4 నిమిషాల సమయం ముగిసేసరికి ఇద్దరూ సమంగా నిలవడంతో మ్యాచ్ 'గోల్డెన్ స్కోర్'కు దారితీసింది. విజేతను నిర్ణయించే ఈ రౌండ్‌లో అస్మిత అద్భుతం చేసింది. ఏ మాత్రం ఏకాగ్రతను కోల్పోకుండా వ్యూహత్మకంగా వ్యవహరించి మరొక 'యూకో' పాయింట్ దక్కించుకుంది. దీంతో 2-1 తేడాతో  విజయం సాధించి భారత్‌కు గోల్డ్‌మెడల్ అందించింది.

సైకిల్ మెకానిక్ కూతురి నుంచి..
23 ఏళ్ల అస్మిత త్రిపురలోని బెలోనియా అనే ఒక చిన్న పట్టణంలో జన్మించింది. ఆమెకు చిన్నతనం నుంచి క్రీడలపై మక్కువ ఎక్కువ. కానీ ఆమె తండ్రి ఒక సైకిల్ మెకానిక్ కావడంతో ఆమె కలలకు ఆర్ధిక ఇబ్బందిలు అడ్డంకిగా మారాయి. అయినప్పటికి అతడు మాత్రం తన కూమర్తెను ఎలాగైనా ఒక మంచి అథ్లెట్‌ను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

సైకిల్ మెకానిక్‌గా పనిచేస్తూనే అస్మితను జూడోలో చేర్పించి శిక్షణ ఇప్పించాడు. కానీ అస్మిత తన కెరీర్‌లో అత్యంత కీలకమైన సమయంలో మోకాలి గాయానికి గురైంది. శస్రచికిత్స కారణంగా ఆమె దాదాపు కొన్ని నెలల పాటు తనకు ఇష్టమైన జుడో క్రీడకు దూరమైంది. అయితే ఆమె తీవ్రంగా శ్రమించి సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ మ్యాట్‌పై అడుగుపెట్టింది.

అస్మిత అద్భుతమైన కమ్‌బ్యాక్‌లో తన తండ్రిది కూడా కీలక పాత్ర. గాయంతో ఆటకు దూరంగా ఉన్న సమయంలో ఆమెకు తన తండ్రి ఎంతో సపోర్ట్‌గా నిలిచాడు. ఆమె ఏ మాత్రం మానసిక ఒత్తిడి గురువ్వకుండా చూసుకున్నాడు. అయితే ఈ రోజు దేశం గర్వించేలా అస్మిత సాధించిన విజయాన్ని చూసేందుకు అతడు లేడు.  గత డిసెంబర్‌లో అస్మిత తండ్రి బ్రెయిన్‌ స్ట్రోక్‌తో చనిపోయాడు. పతకం గెలుచుకున్న అనంతరం అస్మిత తన తండ్రిని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది.

రన్నర్ నుంచి జుడుకోగా
కాగా అస్మిత తన క్రీడా ప్రయాణాన్ని ఒక రన్నర్‌గా ప్రారంభించింది. 800 మీటర్ల రన్నింగ్ ట్రాక్‌పై ఆమె ప్రాక్టీస్‌ చేసింది. అయితే ఆమెలోని అసలైన ప్రతిభను గుర్తించిన మొదటి కోచ్.. తనను జూడో వైపు నడిపించారు. ఆ తర్వాత ఆమె జుడుకోగా అద్భుత విజయాలను సాధించింది. ఆఫ్రికన్ ఓపెన్, జూనియర్ ఆసియా కప్ జూడోలో ఆమె బంగారు పతకాలను కైవసం చేసుకుంది.
 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)