ఇదేం టోర్నీ.. ఇదేం నిర్వాకం!

Published on Wed, 01/14/2026 - 07:23

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ నిర్వహణ పట్ల డెన్మార్క్‌ షట్లర్‌ మియా బ్లిచ్‌ఫీల్డ్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ‘ఇలాంటి అనారోగ్యకర వాతావరణంలో, ప్రొఫెషనల్‌ ప్లేయర్లు పోటీపడే టోర్నీని నిర్వహిస్తారా? ఇండియా ఓపెన్‌ సూపర్‌–750 స్థాయి టోర్నీని నిర్వహించే వేదిక ఇంత చెత్తగా ఉంటుందా?’ అని బ్లిచ్‌ఫీల్డ్‌ నిలదీసింది. ఈ నిర్వాకంపై వెంటనే ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) జోక్యం చేసుకొని ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందే పరిస్థితుల్ని చక్కదిద్దాలని కోరింది. ఢిల్లీలోని కేడీ జాదవ్‌ స్టేడియంలో ఈ ఆగస్టులో ప్రపంచ చాంపియన్‌షిప్‌ జరగనుంది. 

17 ఏళ్ల తర్వాత మనకు దక్కిన ఈ ఆతిథ్య భాగ్యం కోసం కేడీ జాదవ్‌ స్టేడియాన్ని నవీకరిస్తున్నారు. దీంతో పక్కనే ఉన్న ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో ప్రస్తుత ఇండియా ఓపెన్‌ పోటీలు నిర్వహిస్తున్నారు. అయితే ఇందిరా గాంధీ స్టేడియం దుమ్ము ధూళితో కూరుకుపోయిందని, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే వాతావరణం అక్కడ ఏమాత్రం లేనేలేదని, షట్లర్లు సరిగ్గా వార్మప్‌ చేసుకునే పరిస్థితి కూడా లేదని డెన్మార్క్‌ అమ్మాయి తీవ్రస్థాయిలో భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌)పై విరుచుకుపడింది. 

గతేడాది ఆమె ఇండియా ఓపెన్‌ను కేడీ జాదవ్‌ స్టేడియంలో ఆడింది. ఇప్పుడు వేరే వేదికకు మార్చడం పట్ల మెరుగైన స్టేడియం అయి ఉంటుందని ఆశించానని, కానీ దానికంటే మరింత ఘోరంగా ఇందిరాగాంధీ స్టేడియం ఉందని విమర్శించింది. గతేడాది కూడా ఆమె సౌకర్యాలు, వేదికపై ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికీ ఇప్పటికీ ఏమైనా మెరుగైందా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ఏమాత్రం మారలేదు. మెరుగు అనే మాటే లేదు. అప్పుడు ఎలా ఉందో... ఇప్పుడూ అలాగే ఉంది’ అని బ్లిచ్‌ఫీల్డ్‌ ‘బాయ్‌’ అధికారుల తీరుపై మండిపడింది.  

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)