Breaking News

'ఒక ఆటగాడు చనిపోతాడు.. అప్పుడు కూడా వీళ్లు చూస్తూనే ఉంటారు'

Published on Fri, 09/08/2023 - 09:09

యూఎస్‌ ఓపెన్‌లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆధిక వేడివల్ల ప్లేయర్స్‌ అనారోగ్యం బారిన పడుతున్నారు. బుధవారం జరిగిన యుఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌లో రష్యా టెన్నిస్‌ స్టార్‌ డేనియల్ మెద్వెదేవ్ కూడా అస్వస్థతకు గురయ్యాడు. యుఎస్‌ ఓపెన్‌లో అత్యధిక ఉష్ణోగ్రత (35 డిగ్రీల సెల్సియస్‌) మధ్య మ్యాచ్‌ ఆడిన మెద్వెదెవ్‌ వేడి కారణంగా శ్వాస తీసుకుకోవడానికి ఇబ్బంది పడ్డాడు.

ఆట రెండో సెట్‌కు మరో సమయంలో అతడిని ఫిజియో పరీక్షించాడు. ఫిజియో సలహా మెరకు ఇన్‌హేలర్‌ సాయంతో మిగిలిన ఆటను మెద్వెదేవ్ పూర్తిచేశాడు. అయితే మ్యాచ్‌ గేమ్‌ అనంతరం  మెద్వెదేవ్ కీలక వాఖ్యలు చేశాడు. ఈ పరిస్థితుల కారణంగా ఒక ఆటగాడు చనిపోయినా వీళ్లు అలానే చూస్తూ ఉంటారని మెద్వెదేవ్ అసహనం వ్యక్తం చేశాడు.

యూఏస్‌లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఆడటం చాలా కష్టంగా అన్పించింది. ఈ వేడిని తట్టుకో లేక ఒక ఆటగాడు చనిపోతాడు. అప్పుడు వీళ్లు చూస్తూనే ఉంటారు. ఇంతకు ముందు టోక్యో ఒలింపిక్స్‌లో కూడా ఇదే పరిస్థితి. ఈ మ్యాచ్‌లో నేను ఒక్కడినే కాకుండా ఆండ్రీ రుబ్లెవ్ కూడా వేడిని తట్టుకోలేకపోయాడు

తొలి సెట్‌ ఆరంభంలో ఉష్ణోగ్రతలో హెచ్చు తగ్గులు కన్పించాయి. కానీ మూడో సమయానికి నేను బంతిని కూడా చూడలేకపోయాను. అవతలి ఎండ్‌లో నా ప్రత్యర్ధి అలిపోయనట్లు కన్పించి వెంటనే పుంజుకుంటున్నాడు. గెలవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని అని మెద్వెదేవ్ పేర్కొన్నాడు.

ఇక ఈ మ్యాచ్‌లో తన దేశానికే చెందిన ఆండ్రీ రుబ్లెవ్‌ను 6–4, 6–3, 6–4తో మెద్వెదెవ్‌ ఓడించాడు. ఈ విజయంతో యూఎస్‌  ఓపెన్‌ టోర్నీలో  నాలుగోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు.  ఫైనల్లో చోటు కోసం డిఫెండింగ్‌ చాంపియన్‌ అల్‌కరాజ్‌తో మెద్వెదెవ్‌ తలపడతాడు.
చదవండి: సచిన్, గవాస్కర్, కోహ్లి కాదు.. భారత అత్యుత్తమ బ్యాటర్‌ అతడే: గంభీర్‌

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?